Chanakya Niti : విద్యార్థులు వీటిని పాటిస్తే భవిష్యత్ అద్భుతం.. చాణక్య చెప్పిన టిప్స్ మీకోసం..
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు స్వతహాగా ఉపాధ్యాయుడు. విద్య ప్రాముఖ్యత ఏంటో ఆయన బాగా తెలుసు. అందుకే విద్య పట్ల ఆయన అపారమైన

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు స్వతహాగా ఉపాధ్యాయుడు. విద్య ప్రాముఖ్యత ఏంటో ఆయన బాగా తెలుసు. అందుకే విద్య పట్ల ఆయన అపారమైన గౌరవాన్ని కలిగి ఉంటాడు. అపర మేధావిగా కీర్తి గడించిన ఆచార్య చాణక్యుడు ఎన్నో గ్రంథాలు రాశారు. ఇందులో వ్యక్తుల జీవితాలు, నడవడిక, విజయ మార్గాలు, వంటి ఎన్నో అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా తాను రాసిన గ్రంధాల్లో విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి అనేక కీలక సూచనలు చేశారు. విద్యార్థుల భివిష్యత్ బంగారుమయం అవ్వాలంటే విద్యకు సంబంధించి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వీటి పాటించడం ద్వారా ప్రతీ విద్యార్థి తన భవిష్యత్‌ను ఉజ్వలంగా మార్చుకోగలరని పేర్కొన్నారు. మరి చాణక్యుడు చేసి ఆ కీలక సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. జ్ఞానం, విద్య లేకుండా జీవితంలో విజయం సాధించడం అసాధ్యం అని ఆచార్య చాణక్య బలంగా నమ్మాడు. అందువల్లే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా జ్ఞానాన్ని పొందాలని, దీని కోసం, ఎంత విలువైన వస్తువును అయినా త్యాగం చేయాల్సి వస్తే వెనుకాడొద్దన్నారు. 2. మనిషికి మంచి చెడుల మధ్య తేడాను చెప్పేది విద్య. విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోని అభ్యసించాలి. విద్యాభ్యాసం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తికి జీవితంలో ఆటంకాలు, కష్టాలు ఎప్పటికీ తీరవు. చిన్న చిన్న వస్తువులకు కూడా కష్టపడాల్సి వస్తుంది. 3. విద్యను స్వీకరించడంలో క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ లేకుండా పూర్తి విద్యను పొందడం సాధ్యం కాదు. అలాగే, చెడు సహవాసం మీ చదువుకు పెద్ద అడ్డంకి. అందుకే చెడు సాంగత్యాన్ని వదిలేయాలి. 4. గురువు నుండి జ్ఞానాన్ని పొందే విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదు. జ్ఞానాన్ని తీసుకోవడానికి సిగ్గుపడే, సంకోచించే వ్యక్తి జ్ఞానం అసంపూర్ణంగా ఉంటుంది. ఆ అసంపూర్ణ జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడదు.
Also read:
Sushmita Sen Break Up: మా బంధం ముగిసింది.. రోష్మన్‌తో బ్రేకప్‌పై సుస్మిత క్లారిటీ
Home Loan Tips: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!
