Zodiac Signs: ఈ 4 రాశులవారికి వచ్చే రెండు నెలలు తిరుగుండదు.. అదృష్టం వరిస్తుంది.!
జోతిష్యశాస్త్రంలో 12 రాశులు, 9 గ్రహాల గురించి ప్రస్తావిస్తారు. నవ గ్రహాలు ఎప్పటికప్పుడూ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి...
జోతిష్యశాస్త్రంలో 12 రాశులు, 9 గ్రహాల గురించి ప్రస్తావిస్తారు. నవ గ్రహాలు ఎప్పటికప్పుడూ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. తద్వారా ఆ ప్రభావం రాశులపై కనిపిస్తుంది. ఇదిలా ఉంటే 2021వ సంవత్సరం చివర్లో శుక్ర గ్రహం ఓ రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంది. అదేంటంటే.. డిసెంబర్ 30వ తేదీ, 2021న శుక్రుడు తిరోగమన స్థితిలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. 27 ఫిబ్రవరి 2022 వరకు అంటే సుమారు రెండు నెలల పాటు శుక్రుడు ధనుస్సు రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇలా శుక్రుడు రాశిని మార్చుకోవడం 4 రాశులవారికి శుభప్రదం అని జోతిష్య పండితులు చెబుతున్నారు. మరి వాటిల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.!
మేషరాశి:
శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోవడం మేషరాశివారికి ఎంతో శుభప్రదం. రాబోయే రెండు నెలలు ఈ రాశివారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఏ పనినైనా చిత్తశుద్ధితో చేయండి.. తప్పకుండా విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం. శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు పదోన్నతులు పొందొచ్చు.
వృషభం:
శుక్రుడి సంచారం వృషభరాశివారికి అర్దికంగా లాభాన్ని చేకూరుస్తుంది. ఎప్పటినుంచో ఉన్న పాత బకాయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. సరైన వ్యూహాన్ని, ప్రణాళికను రచిస్తే.. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
కర్కాటకరాశి:
శుక్ర సంచారం ఈ రాశివారికి వృత్తిపరంగా లాభాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు.
వృశ్చికరాశి:
శుక్రుడి సంచారం ఈ రాశివారికి కూడా చాలా అదృష్టమని చెప్పొచ్చు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. డబ్బు ఆదా చేసుకోగలరు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి, ఈ సమయం సరైనది అని చెప్పొచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు.