Chanakya Niti: కొత్త సంవత్సరంలో చాణుక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను పాటించండి.. మీ జీవితం స్వర్గమయం చేసుకోండి..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను నీతి శాస్త్రం ద్వారా నేటి ప్రజలకు..

Chanakya Niti: కొత్త సంవత్సరంలో చాణుక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను పాటించండి.. మీ జీవితం స్వర్గమయం చేసుకోండి..
Acharya Chanakya
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2022 | 3:00 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను నీతి శాస్త్రం ద్వారా నేటి ప్రజలకు తెలియజేశాడు. చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో విజయం సాధించాలంటే  కష్టపడి పనిచేయాలి. లక్ష్యాలను సాధించడానికి, గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.  చాణుక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పిన అనే విషయాలు ప్రస్తుత జనరేషన్ కు అనుసరణీయం.   ఎవరైనా సరే చాణుక్యుడి చెప్పిన పాఠాలను అనుసరిస్తూ జీవితంలో ముందుకు సాగితే, అతను తన కష్ట కాలాన్ని  సులభంగా అధిగమిస్తాడు. చాణుక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలను గుర్తు పెట్టుకుంటే…. జీవితంలో సంతోషంగా సాగుతుంది.

మీ బలహీనతను ఎవరికీ చెప్పకండి:  మీ బలహీనతను ఎవ్వరితోనూ చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు ఉవాచ. ఈరోజు మీకు సానుభూతిపరులుగా మారిన వ్యక్తులు రేపు మీకు ప్రత్యర్థులుగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో, అదే వ్యక్తులు మీ బలహీనతను ఉపయోగించుకుంటారు.

సోమరితనం వదలండి: ప్రతి మనిషికి  సోమరితనం అతి పెద్ద శత్రువని ఆచార్య చాణక్యుడు అన్నారు. కనుక మీ పై సోమరితనం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వకండి.. సోమరితనం మీ విజయానికి శత్రువు. మీ కష్టార్జితాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంది. కనుక సోమరితనాన్ని పూర్తిగా వదులుకున్నవారు జీవితంలో సక్సెస్ అందుకుంటారు.

వర్తమానంలో జీవించండి: గడిచి కాలం మార్చలేం.. అయితే వర్తమానం మంత్రం మీదే..కనుక ఎవరైనా వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే,.. వారు ఖచ్చితంగా తమ భవిష్యత్తును మార్చుకోగలరు. గతం నుండి పాఠాలు నేర్చుకోండి.. వర్తమానంలో మెరుగుపరచండి..  భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోండని చాణుక్యుడు చెప్పారు.

మీరు చూసిన లేదా విన్న వాటినే నమ్మండి: మీ పై ఎవరికైనా కోపం వస్తుంది.. లేదా ఒకొక్కసారి ఇతరుల మాటలకు ప్రతిస్పందిస్తారు.. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నవారు మీకు హాని కలిగించేలా మీదగ్గరకు చేరవేయవచ్చు. కానీ అవుటువంటి చెప్పుడు మాటలను నమ్మకండి.  మీ స్వయంగా విన్న, లేదా చూసిన వాటినే నమ్మండి.

ఎవరినీ అవమానించకండి: వ్యక్తి తాను చేసిన కర్మలకు కాలక్రమంలో శిక్షను తానే పొందుతాడని చాణుక్యుడు చెప్పారు. అనవసరంగా ఎవరినీ అవమానపరిచేలా ప్రవర్తించకండి.. మీపై ప్రతికూలత ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు అటువంటి వారి మనస్సు ఎల్లప్పుడూ ఇతరుల హాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కనుక మీ ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోండి.  మిమ్మల్ని లేదా మీరు ఇతరులను కించపరచకండి.

Also Read:  యాదాద్రికి తన ఒంటిపై బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే