AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీరు కొత్త ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటున్నారా.. ఈ 5 వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించండి..

Vastu Tips: ఇంట్లో సమస్యలు లేకుండా మనశాంతిగా ఉండాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పద్దతులను పాటించాలని పెద్దలు చెబుతుంటారు. మనం ఉండే ఇంటి విషయంలో..

Vastu Tips: మీరు కొత్త ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటున్నారా.. ఈ 5 వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించండి..
Vastu Tips
Surya Kala
|

Updated on: Jan 02, 2022 | 3:28 PM

Share

Vastu Tips: ఇంట్లో సమస్యలు లేకుండా మనశాంతిగా ఉండాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పద్దతులను పాటించాలని పెద్దలు చెబుతుంటారు. మనం ఉండే ఇంటి విషయంలో వాస్తుని అనుసరించడం వల్ల అనేక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. నిజానికి వాస్తు శాస్త్రంలో దిక్కులు, ఎక్కడ ఏం వస్తువులు ఉండాలి.. ఇంట్లోకి ఏ దిక్కునుంచి లోపలి వెల్లాలి వంటి అనేక విషయాలను స్పష్టంగా చెప్పారు. అయితే ఎవరైనా కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నా, లేదా కొనబోతున్నా, వాస్తు ప్రకారం చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి నిర్మాణం సానుకూల , ప్రతికూల శక్తిని ఇస్తుందని వాస్తు శాస్త్రంలో స్పష్టం చేశారు. పాజిటివ్ ఎనర్జీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో ప్రతికూల శక్తి ఆర్థిక సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది.

ఇంట్లో వాస్తు దోషాల వల్ల జీవితంలో సమస్యలు వస్తాయి. చేపట్టిన పనుల్లో అపజయం కలుగుతుంది. జీవితంలో మానసిక వేదన పడాల్సి ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో, వాస్తు శాస్త్రంలో కొన్ని చర్యలు ఇవ్వబడ్డాయి.  వీటిని అమలు చేయడం వలన ఇంటిలోని వాస్తు దోషాలు తొలగి.. ఇంటికి శ్రేయస్సు వస్తుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలు లేదా నియమాలను గుర్తుంచుకోవాలనేది ఈరోజు తెలుసుకోండి.

ప్రధాన ద్వారం ఏ వైపున ఉండాలంటే:  వాస్తు ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ఇంటి ప్రవేశ ద్వారం ఉత్తరం వైపు పెట్టుకునే వీలు లేనివారు… ప్రత్యమ్నాయంగా ప్రధాన ద్వార దిశను ఈశాన్యంలో ఉండేలా చూసుకోండి.

ఇంటి పరిమాణం వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి పరిమాణంపై చాలా శ్రద్ధ అవసరం.  ఇల్లు ఎల్లప్పుడూ చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. కనుక భూమిని కొనుగోలు చేసే సమయంలో చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి.  కొత్త ఇంటికి ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

గదుల నిర్మాణంలో  వంటగది తప్పు దిశలో ఉంటే అది పెద్ద దోషమని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కనుక వంటగదిని ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక మాస్టర్ బెడ్ రూమ్ పశ్చిమ దిశలో,  పిల్లల గది ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. కొత్త ఇంటిని నిర్మాణం చేసుకునే ముందు గదుల నిర్మాణం విషయంలో దిశలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

సూర్యోదయ కాంతి  ఇంట్లో సూర్యోదయ కాంతి పడడం చాలా శుభప్రదం.  వాస్తు ప్రకారం.. ఇంట్లో సూర్యోదయపు వేళ కాంతి ప్రసరిస్తే.. ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. అయితే సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రవేశ ద్వారంపై సూర్యకాంతి పడకూడదని గుర్తుంచుకోండి.. ఎందుకంటే అది మంచిది కాదు.

ఇంట్లో ఖాళీ స్థలం:  వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈశాన్య దిశను ఖాళీగా ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుంది.  అలాగే ఇంటి సభ్యుల ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఇంట్లో పూజకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాలంటే.. ఉత్తర  లేదా తూర్పు దిశల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.

Also Read:  కొత్త సంవత్సరంలో చాణుక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను పాటించండి.. మీ జీవితం స్వర్గమయం చేసుకోండి..