ఇంట్లో గోడలకు తాజ్‌మహల్‌, మహాభారతం, యుద్ద చిత్రాల ఫొటోలున్నాయా..! వాస్తు ప్రకారం ఏం జరుగుతుందంటే..?

ఇంట్లో గోడలకు తాజ్‌మహల్‌, మహాభారతం, యుద్ద చిత్రాల ఫొటోలున్నాయా..! వాస్తు ప్రకారం ఏం జరుగుతుందంటే..?
Staircase Vastu Rules

Vastu Rules: వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించేటప్పుడు ఐదు విషయాలు చాలా ముఖ్యమైనవి. వీటిని పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెళ్లివిరుస్తాయి.

uppula Raju

|

Jan 02, 2022 | 3:38 PM

Vastu Rules: వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించేటప్పుడు ఐదు విషయాలు చాలా ముఖ్యమైనవి. వీటిని పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెళ్లివిరుస్తాయి. ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ఉంటుంది. మీరు జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అనుకున్న పని కాకపోతే వాస్తుకు సంబంధించి ఈ విషయాలలో మార్పులు చేయండి. వెంటనే జీవితం ఆశ్చర్యకరమైన రీతిలో మారుతుంది. అలాంటి కొన్ని వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.

1. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. అక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించవలసి ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల ప్రవేశ ద్వారానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. 2. వాస్తు ప్రకారం ఆనందం, శ్రేయస్సు కోరుకునే వారు తమ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. భారీ వస్తువులు, చెత్త ఉండకూడదు. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తాయి. 3. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వద్ద డబ్బు నిలవలేదంటే తప్పనిసరిగా ఇంటి వాస్తు మార్చాల్సిందే. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మీ ఆలయంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఫోటోను ఉంచి ప్రతిరోజూ పూజించాలి. 4. డబ్బుతో పాటు ఆరోగ్యవంతమైన శరీరం కూడా చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ ఇంటి వంటగది వాస్తును జాగ్రత్తగా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఆగ్నేయం వంటగదికి ఉత్తమమైనదిగా చెబుతారు. మీ వంటగదిని ఈ దిశలో నిర్మించడమే కాకుండా వంట చేసేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు వైపున ఉంచాలి. 5. వాస్తు ప్రకారం ముళ్ల మొక్కలు, మాంసాహార జంతువులు, తాజ్ మహల్, మహాభారతం లేదా ఏదైనా యుద్ధ చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. ఇలాంటి చిత్రాలు ఇంటిలోపల ప్రతికూలతను తెచ్చి వ్యక్తిని అపజయం వైపు నెట్టివేస్తాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

అన్నదాతలకు శుభవార్త.. వ్యవసాయ రుణ లక్ష్యం పెంచే యోచనలో ప్రభుత్వం.. ఎంతమేరకంటే..?

హిజాబ్ ధరించినందుకు క్లాస్‌లోకి నో ఎంట్రీ.. ముస్లిం బాలికల ఆందోళన.. ఎక్కడంటే..?

Worshiping Trees: ఈ చెట్లలో దేవతలు నివసిస్తారట.. అందుకే పూజిస్తారట..? ఆ చెట్లు ఏంటంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu