Chanakya Niti: మీరు ఒక వ్యక్తిని లొంగదీసుకునే నైపుణ్యాన్ని నేర్చుకోవాలనుకుంటే, ఆచార్య చాణక్యుడి విషయం గుర్తుంచుకోండి.
Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు(Acharya Chanakya)నకు ఆర్థిక శాస్త్రం(Economics), రాజకీయాలు, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై మంచి పరిజ్ఞానం ఉంది. చాణక్యుడి తన జీవిత సారాన్ని,..
Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు(Acharya Chanakya)నకు ఆర్థిక శాస్త్రం(Economics), రాజకీయాలు, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై మంచి పరిజ్ఞానం ఉంది. చాణక్యుడి తన జీవిత సారాన్ని, అనుభవాలను నీతి శాస్త్రం(niti Shastra)లో పొందుపరిచాడు. చాణుక్యుడు ఏదైనా పరిస్థితిని ముందుగానే ఊహించి, దానిని ఎదుర్కోవటానికి వ్యూహాన్ని సిద్ధం చేసేవాడు. చాణుక్యుడు రచించిన నీతి పుస్తకంలోని అంశాలు నేటికీ అనుసరణీయమని పెద్దల నమ్మకం. చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా 4 రకాల వ్యక్తులను ఎలా నియంత్రించాలో చెప్పాడు. ‘లుబ్ధమర్థేన్ ఘృణీయత్తబ్ధమాంజలి కర్మణా, మూర్ఖ ఛందనురోదేన్ వాస్తవికత న పండితమ్’.
- ఈ శ్లోకంలో ఏ వ్యక్తి ధోరణి అయినా అత్యాశతో ఉంటే.. అతనికి డబ్బు ఇవ్వడం ద్వారా అతన్ని చాలా సులభంగా నియంత్రించవచ్చు అని ఆచార్య చెప్పారు. అలాంటి వ్యక్తి డబ్బు వ్యామోహంలో దేనికైనా సిద్ధపడతాడు.
- అదే తనకు తాను గర్వంగా ఫీల్ అయ్యే వ్యక్తి అయితే.. అతను చప్పట్లు, పొగడ్తలను వినాలని కోరుకుంటాడు. అంతేకాదు ఇతరులను కించపరచాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తిని నియంత్రించాలంటే.. అతనిని కీర్తిస్తూ, అతనిని చాలా ఉన్నతంగా పిలిచి గౌరవం ఇస్తే.. అలాంటి వ్యక్తిని నియంత్రించవచ్చు
- తెలివితక్కువ వ్యక్తిని లొంగదీసుకోవాలంటే.. అతను ఎప్పుడు ఏ పని చేసినా ప్రశంసించండి.. దీంతో అతను సంతోషంగా ఉంటాడు. మిమ్మల్ని ఆరాధిస్తాడు. ఏపని చేయడానికి అయినా సిద్ధంగా ఉంటాడు.
- అదే ఒక పండితుడిని అంటే తెలివైన వ్యక్తిని నియంత్రించడానికి.. ఎవరైనా సరే మనస్సుతో పని చేయాలి. ఎందుకంటే అతన్ని నియంత్రించడం అంత సులభం కాదు. తెలివైన వ్యక్తికి చాలా విషయాలు తెలుసు. అంతేకాదు ఎదుటి వ్యక్తులను , పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. అటువంటి పరిస్థితిలో. అటువంటి వ్యక్తిని కనుక నియంత్రించాలంటే.. అతని ముందు సెంటిమెంట్, అర్ధవంతమైన విషయాలు చెప్పడం ద్వారా మాత్రమే జరుగుతుంది.
Also Read: