Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ అందుకోవాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటించిచూడండి..

ఎన్ని సార్లు కష్టపడినా అపజయం కలిగితే.. ఆ వ్యక్తి నిరాశతో నిండి ఉంటాడు. ఏదైనా ఆలోచించి..  అర్థం చేసుకుని ముందుకు వెళ్లే పరిస్థితిని కోల్పోతాడు. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా చేపట్టిన పనుల్లో వైఫల్యాన్ని ఎదుర్కొంటూ..  జీవితంలో నిరాశకు గురైనట్లయితే

Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ అందుకోవాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటించిచూడండి..
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2022 | 6:03 PM

జీవితంలో విజయం సాధించాలని.. ఎక్కువ డబ్బు సంపాదించి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి వ్యక్తి కల. అయితే చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని సార్లు కష్టపడినా అపజయం కలిగితే.. ఆ వ్యక్తి నిరాశతో నిండి ఉంటాడు. ఏదైనా ఆలోచించి..  అర్థం చేసుకుని ముందుకు వెళ్లే పరిస్థితిని కోల్పోతాడు. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా చేపట్టిన పనుల్లో వైఫల్యాన్ని ఎదుర్కొంటూ..  జీవితంలో నిరాశకు గురైనట్లయితే..  ఖచ్చితంగా ఆచార్య చాణక్యుడి చెప్పిన కొన్ని విధానాలను అనుసరించండి.

ఆచార్య చాణక్యుడి సక్సెస్ కోసం చెప్పిన విధానాలను అనుసరించండి

  1. చాణక్య నీతి ప్రకారం.. పనిలో విజయం సాధించడానికి ముఖ్యమైన మంత్రం సమయం. ఒక వ్యక్తి ఏదైనా కొత్త పనిని సమయం చూసి మాత్రమే ప్రారంభించాలి.
  2. మీ సమయాన్ని పరిస్థితిని అంచనా వేసి ఏదైనా కొత్త పనిని ప్రారంభించండి ఎందుకంటే అలాంటి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని చాణక్యుడు చెప్పాడు.
  3. ఇవి కూడా చదవండి
  4. చాణక్యుడు ప్రకారం.. ఎవరైనా సరే తమ స్నేహితుడు , శత్రువు మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. తరచుగా ప్రజలు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉంటారు.. అయితే స్నేహం ముసుగుతో మెలిగే శత్రువుల చేతిలో సులభంగా మోసపోతారు.
  5. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఏదైనా చేసే పని మీద పూర్తి సమాచారం లేకపోవడం ఆ వ్యక్తి అతిపెద్ద బలహీనత. ఏదైనా పనిని ప్రారంభించే ముందు..  దానిగురించి సరైన సమాచారం, స్థలం, పని మొదలైన వాటి గురించి బాగా తెలుసుకోవాలి.
  6. చాణక్య నీతి ప్రకారం..  ప్రతి సంబంధం వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. ఇది పని చేస్తున్న ప్రదేశానికే కాదు మన వ్యక్తిగత జీవితాలకు కూడా వర్తిస్తుంది.
  7. మన సహోద్యోగులు, స్నేహితులు లేదా బంధువులు కావచ్చు, ప్రతి ఒక్కరి బంధాల పునాది ఏదో ఒకదానిపై లేదా మరొకటి స్వార్థంపై ఆధారపడి ఉంటుంది. కనుక స్నేహితులను ఎన్నుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపోకుండా మీ స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)

ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..