AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వచ్చిందమ్మ మాలక్ష్మి మా ఇంటికి.. ఆడపిల్ల పుట్టిందని ఆ కుటుంబ సంబరం

ఆడపిల్లను భారంగా భావిస్తారు చాలామంది. ఇంకొందరు అయితే కడుపులోనే ఆడబిడ్డల్ని నలిపేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని ఆ ఇంట సంబరం జరిగింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ ఆ కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి ..

Telangana: వచ్చిందమ్మ మాలక్ష్మి మా ఇంటికి.. ఆడపిల్ల పుట్టిందని ఆ కుటుంబ సంబరం
Cute Baby
P Shivteja
| Edited By: Ram Naramaneni|

Updated on: May 26, 2025 | 12:40 PM

Share

ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అని, సంతోషపడే వారు చాలా తక్కువగా ఉంటారు. అమ్మాయి కంటే అబ్బాయే పుట్టాలి అని చాలామంది దేవుళ్లకు మొక్కుతూ ఉంటారు. జనరేషన్స్ మారుతున్నా ఆడపిల్లను భారంగా చూసే రోజులు మారడం లేదు. మగ పిల్లగాడు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబరాలు జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అబ్బాయి పుడితే అదేదో ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీలవుతుంటారు. అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతుంది. ఆడపిల్ల పుడితే తమ ఇంటికి ప్రిన్సెస్ వచ్చిందనే భావించే మనుషులు తారసపడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆడబిడ్డను అలానే ట్రీట్ చేసింది ఓ కుటుంబం. ఇంటికి మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డతో వచ్చిన దంపతులకు  పూలు చల్లుతూ  స్వాగతం పలికారు కుటుంబీకులు.

వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన కరుణాకర్, స్పందన దంపతులకు 27 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఇటీవల అమ్మమ్మగారి ఇంట్లో తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. కాగా ఆదివారం కరుణాకర్ నర్సాపూర్‌లోని తన నివాసానికి పుట్టిన పాపను తీసుకొస్తుండగా బంధుమిత్రులు, కుటుంబసభ్యులు అందరూ కలిసి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. తమ ఇంటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆడపిల్ల పుట్టగానే భారం అనుకొని విసిరేసిన తల్లిదండ్రులను చూసాం, కడుపులో పెరుగుతుంది ఆడపిల్లని తెలుసుకొని అబార్షన్లు చేయించే తల్లిదండ్రులను చూసాం. కానీ ఆడపిల్ల పుట్టడంతో సంబరాలు జరుపుకుంటూ ఘనంగా స్వాగతించడం మాత్రం చాలా అరుదు. నిజంగా ఈ కుటుంబాన్ని అభినందిచాల్సిందే.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై