AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఇకనుంచి శ్రీవారి సేవలు విశ్వవ్యాప్తం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కీలక నిర్ణయం..

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. టిటిడిలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు టిటిడి ఈవో జె శ్యామల రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.

Tirumala: ఇకనుంచి శ్రీవారి సేవలు విశ్వవ్యాప్తం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కీలక నిర్ణయం..
Tirumala Tirupati Devasthanams
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 25, 2025 | 1:45 PM

Share

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. టిటిడిలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు టిటిడి ఈవో జె శ్యామల రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్న సమావేశంలో 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్ఆర్ఐలు వర్చువల్ గా హాజరయ్యారు.. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేసేందుకు భక్తులు పలు రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్నారన్న ఈఓ తెలిపారు. దేశంలోని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకులు తిరుమలకు వచ్చి సేవలు అందిస్తున్నారని వివరించారు.

ఇప్పుడు ఈ సేవల్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిందని.. ఈవో తెలిపారు. వివిధ రంగాలలో నిపుణులైన ఎన్ఆర్ఐ లు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొంది. టిటిడిలోని వివిధ విభాగాలలో దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకులు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నా ఈఓ.. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సహకరిస్తున్నారని తెలిపారు.తాజాగా శ్రీవారి సేవలో తీసుకొస్తున్న సంస్కరణలలో భాగంగా టిటిడి ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

Tirumala News

Tirumala News

వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించేందుకు ఎన్.ఆర్.ఐలు ముందుకు వస్తున్నారన్నారని టీటీడీ పేర్కొంది. ఎన్.ఆర్.ఐల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టిటిడిలో అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని ఈవో శ్యామల రావు తెలిపారు. ఇక NRI లు కూడా శ్రీవారి సేవకుల సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు టిటిడి ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇలాంటి అవకాశం స్వామి వారు కల్పించిన మహద్భాగ్యమని హర్షం వ్యక్తం చేశారు ఎన్ఆర్ఐ ప్రతినిధులు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో జర్మనీ నుంచి సూర్యప్రకాశ్, డా. శివశంకర్, ఐర్లాండ్ నుంచి సంతోష్ పల్లె, రమేశ్ గుమ్మడవల్లి, యూకె నుంచి లోకనాథం, విజయ్ కుమార్, అరుణ్ ముమ్మలనేని, శివరామ్ రెడ్డి, విజయ్ కుమార్, డా. అనిల్ కుమార్, డా. అనిల్ కుమార్, రీతు, నెదర్లాండ్ నుంచి శివరామ్, ప్రాన్స్ నుంచి కన్నెవిరనె, పోలెండ్ ఐర్లాండ్ నుండి సంతోష్, చంద్ర అక్కల, స్వీడన్ నుంచి రమణకుమార్ రంగా, స్విట్జర్లాండ్ నుంచి అమర్ కవి, అమెరికా నుంచి రఘువీర్ బండార్, హర్షిత, USA నుంచి అమరనాథ్, డెన్మార్క్ నుంచి రామ్ దాస్, మారిషష్ శ్రీలంక నుండి విక్కీ తురాయ్జా, దుబాయ్ నుంచి విక్రమ్ యూకే నుండి డాక్టర్ స్కాటర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..