AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మబాబోయ్.. కొండచిలువ గుడ్లను ఎప్పుడైనా కళ్లారా చూసారా..! వామ్మో.. ఇదిగో

పొలంలో అలికిడి వినిపించింది.. దీంతో అక్కడి రైతులు అటుగా ఓ కన్నేశారు.. ఏదో పురుగు వెళ్లినట్లు అనిపించింది.. క్షుణ్ణంగా పరిశీలించగా గుండె ఆగినంత పనైంది..భయంకరమైన కొండ చిలువ (పైథాన్) ను చూసి పరుగులు తీశారు.. ఆ తర్వాత కర్రలతో దానిని తరిమేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొండ చిలువ పొలంలోని ఓ గుంతలోకి వెళ్లి.. నక్కింది..

Viral Video: అమ్మబాబోయ్.. కొండచిలువ గుడ్లను ఎప్పుడైనా కళ్లారా చూసారా..! వామ్మో.. ఇదిగో
Python Eggs
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 25, 2025 | 1:21 PM

Share

పాము అనగానే భయపడని వాళ్ళు ఉండరు.. మరి జంతువులను అమాంతంగా మింగేసే కొండచిలువ (పైథాన్) మీ కళ్ళ ముందు కనబడితే..?! గుండెలు పట్టుకొని పరుగులు పెట్టడం ఖాయం. కనిపించడం దేవుడెరుగు..! దాని గురించి వెంటనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ.. విశాఖలోని ఓ రైతు పొలంలో వెళ్తుండగా ఓ భారీ కొండచిలువ కనిపించింది. వేట కోసం బయలుదేరినట్టు మెల్లగా జారుకుంటుంది.. దూరం నుంచి చూసి ఏదో అనుకుని దగ్గరకు వెళ్లే చూసేసరికి భారీ కొండచిలువ. ఆమ్మో అనుకుని గుండెలు కొట్టుకున్నాడు. మెల్లగా తరిమే ప్రయత్నం చేశాడు.. దీంతో జర్రున జారుకుంటూ పొలంలోని తీసి ఉన్న గోతిలోకి దిగిపోయింది ఆ కొండచిలువ. తొంగి చూస్తే.. తెల్లగా భారీ సంఖ్యలో గుడ్లు కనిపించాయి.. అయితే.. ఆ గుడ్లను తినేందుకు దానిలోకి దిగి ఉంటుందని అంతా భావించారు.. కానీ వాళ్లు అనుకున్నది ఒకటి.. అక్కడ వాస్తవం మరొకటి.. ఎందుకంటే ఆ కొండచిలువే ఆ గుడ్లను పెట్టింది. ఆలస్యంగా ఆ విషయం స్థానికులకు అర్థమైంది. సకాలంలో సమాచారం స్నేక్ కేచర్ కు అందడంతో.. కొండచిలువతో పాటు పాము సేఫ్‌గా రెస్క్యూ అయింది. ఈ ఘటన విశాఖపట్నం పెందుర్తి శివారు పినగాడి రాంపురంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రాంపురం ప్రాంతానికి చెందిన ప్రమోక్ అనే రైతు పొలాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అక్కడున్నవారికి భారీ కొండచిలువ కనిపించింది. దాని పొడవు చూస్తే 10 అడుగుల పైగానే ఉంది. కొండచిలువ వెళ్లి గోతిలోకి దిగడంతో ఆ గోతిలో గుడ్లు కనిపించాయి. గుడ్లను మింగేసేందుకు దిగిందేమో అనుకున్నారు స్థానికులు. కొంతమంది దాన్నే మట్టు పెట్టాలనుకున్నారు. మరి కొంతమంది అమ్మో అనుకుని.. సమాచారాన్ని స్నేక్ కిరణ్ కుమార్ కు అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. పాము ఉన్న గోతిలోకి తొంగి చూసాడు. దీంతో పాము తో పాటు గుడ్లు కూడా కనిపించాయి. అయితే ఆ గుడ్లను కొండచిలువే పెట్టి పొదుగుతున్నట్టు గుర్తించాడు కిరణ్. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. అధికారుల సూచనలతో.. కిరణ్ కుమార్ తన బృందంతో కలిసి పామును నెమ్మదిగా బయటకు తీశాడు. ఆ తరువాత ఆ గోతిలో ఉన్న గుడ్లను ఒక్కొక్కటిగా సేఫ్ గా సేకరించాడు. తీసే కొద్ది గుడ్లు వస్తూనే ఉన్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 గుడ్లు.. అవి కూడా భారీగానే ఉన్నాయి.

Visakhapatnam Python

Visakhapatnam Python

పొదిగేందుకు ఎన్ని రోజులో తెలుసా..

భారీ కొండచిలువతో పాటు.. దాని గుడ్లను కూడా సేఫ్ గా రెస్క్యూ చేసిన స్నేక్ కేచర్.. పాముకు సపర్యలు చేశాడు. కొండచిలువ, గుడ్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు స్నేక్ క్యాచర్ కిరణ్. సాధారణంగా 54 రోజుల్లో గుడ్లను కొండచిలువ పొదుగుతుందని.. గుడ్లను పెట్టి నాలుగు నుంచి వారం రోజులై ఉంటుందని టీవీ9 తో అన్నాడు స్నేక్ క్యాచర్ కిరణ్. ఇప్పటివరకు దాదాపుగా 30 వేల వరకు పాములను పట్టి సేఫ్గా అడవుల్లో విడిచిపెట్టిన కిరణ్.. చాలావరకు గాయపడిన పాములకు సర్జరీ చేయించి మరి ఫారెస్ట్ అధికారుల సహకారంతో అడవుల్లో విడిచి పెట్టాడు. పాములు జీవవైవిద్యానికి మేలు చేస్తాయి.. ఎక్కడైనా పాములు కనిపిస్తే హాని చేయకండి సమాచారం ఇవ్వండని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కోరుతున్నాడు స్నేక్ క్యాచర్ కిరణ్..

వీడియో చూడండి..

మాంసాహారి.. ఇండియన్ పైథాన్..!

ఇండియన్ పైథాన్ అనేది భారత ఉపఖండం, ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలకు చెందిన ఒక పెద్ద పైథాన్ జాతి. దీనిని బ్లాక్-టెయిల్డ్ పైథాన్, ఇండియన్ రాక్ పైథాన్, ఆసియన్ రాక్ పైథాన్ అనే సాధారణ పేర్లతో కూడా పిలుస్తారు. దాని సంకోచించే సామర్ధ్యాలకు ప్రసిద్ధి చెందిన పెద్ద, శక్తివంతమైన పాము కొండచిలువ. ఇండియన్ పైథాన్‌ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమీటంటే.. అడవులు, గడ్డి, భూములు, రాతి ప్రదేశాలతో సహా వివిధ రకాల ఆవాసాలలో నివసిస్తాయి కొండచిలువలు ఆవాసాలుగా మలచుకుని జీవిస్తూ ఉంటాయి. కొండచిలువలు కేవలం మాంసాహారులు. చిన్న క్షీరదాలు, పక్షులు, సరీసృపాలను తింటాయి. తనకంటే చిన్న సైజులో ఉన్న పాములను వేటాడి మరి తింటాయి. జంతువులు పక్షుల గుడ్లను కూడా ఆహారంగా తీసుకుంటాయి. వాటి ఆవాసాలకు నష్టం కలిగించడం, వేట, హింస కారణంగా భారతీయ పైథాన్‌లు రెడ్ లిస్ట్‌లో ముప్పు పొంచి ఉన్న వాటిగా జాబితాలో ఉన్నాయి. కొండచిలువులను వేటాడినా, చంపినా శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు అటవీ శాఖ అధికారులు..

గుడ్ల కోసం ప్రత్యేక ఆవాసాలు..

కొండచిలువల్లో ఆడ జీవులు.. గుడ్ల ను పెడతాయి. వాటిని సంరక్షిస్తూ పొదుగుతాయి. కొన్ని వాస్తవానికి వాటిని పెంచుతాయి. ఉష్ణపరంగా స్థిరంగా ఉండే గూడు కట్టే ప్రదేశాలను ఎంచుకుంటాయి. తరువాత వాటి గుడ్లు పెట్టి వాటి చుట్టూ తిరుగుతాయి. గుడ్లు ఆడ జీవి శరీరంతో చాలా స్థిరమైన పొదిగే ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసి గుడ్లను పొదుగుతుంది. కానీ మారుతున్న మానవ జీవన విధానంలో చెట్లు, పొదలను తొలగిస్తున్న నేపథ్యంలో.. ఇటువంటి పాములు తమ సంతతిని వృద్ధి చేసేందుకు అనుకూల అవకాశాలు తగ్గిపోతున్నాయి. తద్వారా అంతరించిపోయే పరిస్థితిలు తలెత్తుతున్నాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..