AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆమెకు పెళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు.. అతనికి కాలేదు.. ఇన్‌స్టాలో కనెక్టయ్యారు.. చివరకు

ప్రేమ గుడ్డిదంటారు. ఆ ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదంటారు. అలా వయసుతో సంబంధం లేకుండానే తిరుపతి జిల్లాలో ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. ఏడాది పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు కారణం అయ్యింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఆ ఇద్దరూ ప్రాణాలు తీసుకునేందుకుదారి తీసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

Andhra: ఆమెకు పెళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు.. అతనికి కాలేదు.. ఇన్‌స్టాలో కనెక్టయ్యారు.. చివరకు
Extra Marital Affair
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 25, 2025 | 3:13 PM

Share

ఆమెకు పెళ్లైంది.. భర్త.. పిల్లలున్నారు.. అతనికి పెళ్లి కాలేదు.. ఈ క్రమంలోనే ఇన్‌స్టాలో ఇద్దరికీ పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత ఆమె అతని దగ్గరకు వెళ్లింది.. పోలీసుల పంచాయితీతో మళ్లీ ఇంటికి వెళ్లింది.. ఆ తర్వాత ప్రియుడిపై మోజుతో మళ్లీ భర్త, పిల్లలను వదిలేసి అక్కడికే వెళ్లింది.. చివరకు ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమో కానీ.. ప్రియుడు.. ఆమె గొడవ పడ్డారు.. దీంతో ఆమె ఉరివేసుకోని చనిపోగా.. అతను కూడా పరుగుల మందు తాగి చనిపోయాడు.. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. ఇద్దరి ప్రాణం తీసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి జిల్లాలో సంచలనంగా మారింది. విశాఖపట్నంలోని ముస్లిం తాటి చెట్ల పాలెం చెందిన 40 ఏళ్ల వివాహిత పద్మకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడు సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ఘాటు ప్రేమగా మారిపోయింది. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల సురేష్ కు ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయమైన పద్మతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో పద్మ భర్త, ఇద్దరు పిల్లలను వదిలి సురేష్ కోసం శ్రీకాళహస్తికి వచ్చేసింది. 40 ఏళ్ల వెంకటలక్ష్మి అలియాస్ పద్మ కొడుకు మెడికల్ రిప్రెజెంటేటివ్ గా పనిచేస్తుండగా, కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం హాబీ గా పెట్టుకున్న పద్మకు పాతికేళ్ల సురేష్ తో ఏర్పడ్డ పరిచయం ఇప్పుడు రెండు కుటుంబాలకు శాపంగా మారింది. సురేశ్ కావాలని శ్రీకాళహస్తికి వచ్చిన పద్మ కనిపించక పోవడంతో కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు ఆమె శ్రీకాళహస్తి లో ఉన్నట్లు గుర్తించారు. పద్మ ఆచూకీ తెలుసుకుని అప్పట్లో ఆమెను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సురేష్ తోనే జీవితం కొనసాగించాలని భావించిన పద్మ లేఖ రాసి మరీ గతేడాది నవంబరు లోనే మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేసింది.

కుటుంబ సభ్యులు బతిమలాడినా రానని తెగేసి చెప్పిన పద్మ సురేష్ ను వివాహం చేసుకుంది. పద్మ సురేష్ పెళ్లికి శ్రీకాళహస్తి లోని సురేష్ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం తెలపడంతో కైలాసగిరిలో సురేశ్ పద్మతో కలిసి కాపురం పెట్టాల్సి వచ్చింది. సాఫీగానే సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో గానీ మూడు రోజుల క్రితం పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని తనువు చాలించింది. దీంతో సురేశ్ భయంతో తలుపులు వేసుకుని ఆ గదిలోనే ఉండిపోయి నిన్న బయటకు వచ్చి విషయాన్ని తల్లికి చెప్పాడు. పద్మ సూసైడ్ విషయాన్ని తెలిపాడు.

ఇంట్లో ఆహారాన్ని వృథా చేస్తోందని మందలించడంతో 3 రోజుల క్రితం పద్మ ఉరి వేసుకుందని, శవాన్ని కిందకు దించి, భయంతో తాను కూడా విషం తాగినట్లు సురేశ్ తల్లికి వివరించాడు. మూడు రోజుల తరువాత మెలకువ రావడంతో బయటికి వచ్చానని చెప్పాడు. ఈ మేరకు సురేశ్ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషం తాగిన సురేష్ ను ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇంస్టాగ్రామ్ పరిచయం, వయసుతో సంబంధం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్లి.. ఆ ఇద్దరూ మృతికి కారణమైంది.. చివరకు ఇద్దరి ప్రేమ కథ విషాదంగా ముగిసింది.. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..