Weather Alert: అల్పపీడనం, ద్రోణి, రుతుపవనాలు.. నా సామిరంగ వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది.. దీంతోపాటు ద్రోణి అలాగే.. రుతు పవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది.. దీంతోపాటు ద్రోణి అలాగే.. రుతు పవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఈరోజు, మే 25, 2025న పశ్చిమ మధ్య – తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరాంలోని మరికొన్ని ప్రాంతాలు, మణిపూర్ – నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 15.5°ఉత్తర అక్షాంశం / 55°తూర్పురేఖాంశం , 16°ఉత్తర అక్షాంశం / 70°తూర్పురేఖాంశం, దేవ్‌గడ్, బెలగావి, హవేరి, మాండ్య, ధర్మపురి, చెన్నై, 15°ఉత్తర అక్షాంశం /83°తూర్పురేఖాంశం, 18°ఉత్తర అక్షాంశం/87°తూర్పురేఖాంశం, 20°ఉత్తర అక్షాంశం/89°E, ఐజ్వాల్, కోహిమా, 26.5°ఉత్తర అక్షాంశం/95°తూర్పురేఖాంశం, 27°ఉత్తర అక్షాంశం/97°తూర్పురేఖాంశం వరకు కొనసాగుతున్నది.
రాబోయే 3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, బెంగళూరుతో సహా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య – ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
ఒక ద్రోణి తూర్పు మధ్య అరేబియా సముద్రం నుండి ఉత్తర ఒడిశా వరకు, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా, సగటు సముద్ర మట్టానికి 1.5 మరియు 4.6 కి.మీ మధ్య దక్షిణ దిశగా ఎత్తులో విస్తరించి ఉంది.
మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య -దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం, మంగళవారం భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు -బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
గమనిక :- రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 3-5 °C తక్కువ గా ఉండే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
