AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhishma Niti: భార్య, భర్తలు ఓకే ప్లేట్‌లో భోజనం చేయవద్దు అంటున్న భీష్మ.. వెంట్రుక వచ్చిన అన్నం తింటే కలిగే ఫలితం ఏమిటో తెలుసా..

Bhishma Niti: పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం (Mahabharth) లో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడి (Bhishma ) ది. మహాభారతానికే వెన్నుముకగా నిలిచిన భీష్ముడు.. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా ..

Bhishma Niti: భార్య, భర్తలు ఓకే ప్లేట్‌లో భోజనం చేయవద్దు అంటున్న భీష్మ.. వెంట్రుక వచ్చిన అన్నం తింటే కలిగే ఫలితం ఏమిటో తెలుసా..
Bhishma Niti
Surya Kala
|

Updated on: Mar 31, 2022 | 9:34 AM

Share

Bhishma Niti: పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం (Mahabharth) లో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడి (Bhishma ) ది. మహాభారతానికే వెన్నుముకగా నిలిచిన భీష్ముడు.. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా  ఖ్యాతిగాంచాడు. భీష్ముడు అంపశయ్య (Ampashayya)పై ఉన్నప్పుడు రాజ్య పాలన, రాజధర్మం, వంటి అనేక విషయాలపై పాండవులకు హితబోధ చేశాడు. కురుపితామహుడు చేసిన ఉపదేశాలు నేటి పాలకులకు, ప్రజలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. భార్య భర్తల మధ్య ఉండే అనుబంధం.. వారిద్దరూ ఓకే విస్తరిలో ఆహారం తినడం వలన కలిగే ఇబ్బందులను గురించి ధర్మరాజుకి వివరించాడు. ఆహారానికి సంబంధించిన అన్ని నియమాలను చెబుతూ ఎలాంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం, ఎప్పుడు అశుభం అని స్పష్టం చేశారు. ఈ రోజు భార్యాభర్తలు ఒకే కంచంలో ఎందుకు భోజనం చేయకూడదో భీష్ముడు చెప్పిన వివరణ గురించి తెలుసుకుందాం..

భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో భోజనం చేస్తే ప్రేమ పెరుగుతుందనేది నిజం. భీష్మ పితామహులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కుటుంబానికి సంబంధించి ప్రతి వ్యక్తికి అనేక విధులు ఉంటాయని ఆయన నమ్మారు. ఆ విధులను నిజాయితీగా నిర్వర్తించాలంటే, కుటుంబాన్ని ఐక్యంగా ఉంచాలంటే, భార్యతో కలిసి ప్లేట్‌లో భోజనం చేయవద్దు. భార్యతో కలిసి ఒక ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం ద్వారా, కుటుంబంలోని ఇతర సంబంధాలతో పోలిస్తే భర్తకు భార్యపై ప్రేమ మరింత అధికమవుతుంది. అంతేకాదు భార్య మనసు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  అప్పుడు తప్పుఒప్పుల మధ్య తేడా గుర్తించలేడు. అలా ఒకే కంచంలో అన్నం తిన్న భర్త ఎడిక్ట్ అవుతాడు. భార్య ప్రేమ ముఖ్యమని అనుకుంటాడు. అది కుటుంబంలో కలహాలకు కారణం అవుతుంది. భార్యని బానిసగా మారుతుంది. కనుక భార్యతో కలిసి ఒకే ప్లేట్‌లో భోజనం చేయకూడదని భీష్ముడు చెప్పారు.

కుటుంబం కలిసి కూర్చుని తినాలి: సోదరులు, ఇతర కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని భోజనం చేయాలని భీష్మ పితామహుడు చెప్పాడు. ఇలా చేయడం వలన కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరు త్యాగం, అంకిత భావంతో ఉంటారు. కుటుంబం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

ఎటువంటి ఆహారం తినకూడాదు అంటే: భోజనం కోసం ఆహారపదార్ధాలు వడ్డించిన ప్లేట్‌ను ఎవరైనా దాటితే.. అటువంటి ఆహారం బురదలా కలుషితమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి ఆహారాన్ని జంతువులకు పెట్టెయ్యాలి. వెంట్రుకలు వచ్చిన ఆహారాన్ని తినకూడదు. దీంతో ఇంట్లో ధన నష్టం వాటిల్లుతోంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Madhya Pradesh: రెండు తలలు, మూడు చేతులతో వింత బేబీ జననం.. చిన్నారి పరిస్థితి విషమం

Telangana: తల్లిదండ్రులకు పాద పూజ చేసిన పిల్లలు.. అమ్మానాన్నల సేవని త్యాగాన్ని గుర్తించమంటున్న స్కూల్ యాజమాన్యం