Telangana: తల్లిదండ్రులకు పాద పూజ చేసిన పిల్లలు.. అమ్మానాన్నల సేవని త్యాగాన్ని గుర్తించమంటున్న స్కూల్ యాజమాన్యం

Telangana: కనిపించని ఆ దైవం కంటే.. కని పెంచే తల్లిదండ్రులు మిన్న..అమ్మానాన్నలు దేవుళ్లతో సమానం. జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం. ప్రత్యక్షదైవాలైన వారిని వదిలేసి..

Telangana: తల్లిదండ్రులకు పాద పూజ చేసిన పిల్లలు.. అమ్మానాన్నల సేవని త్యాగాన్ని గుర్తించమంటున్న స్కూల్ యాజమాన్యం
Paada Pooja Of Parents
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2022 | 9:05 AM

Telangana: కనిపించని ఆ దైవం కంటే.. కని పెంచే తల్లిదండ్రులు మిన్న..అమ్మానాన్నలు దేవుళ్లతో సమానం. జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం. ప్రత్యక్షదైవాలైన వారిని వదిలేసి కనిపించని దేవుడి కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం. పూజించకపోయినా పర్వాలేదు గానీ వారి ఆదరించాలని ఓ పాఠశాల నిర్వాహకులు అరుదైన గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్త భూమికంటే బరువైనది తల్లి…. ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లిదండ్రులకు నమస్కరిస్తే గోవును దానం చేసిన ఫలం దక్కుతుంది. సత్యం తల్లి… జ్ఞానం తండ్రి. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ, వెయ్యిసార్లు కాశీయాత్ర, వందసార్లు సముద్ర స్నానం చేసిన ఫలమూ దక్కుతాయి. ఈ విషయానికి భావితరాలకు గుర్తు పెట్టుకునే విధంగా ఓ స్కూల్ వినూత్న కార్యక్రమం చేపట్టింది.

మహబూబబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని శ్రీ చైతన్య (Sri Chaitnaya) నిర్వాహకులు విద్యార్థులచేత వారి తల్లిదండ్రులకు సామూహిక పాదపూజ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో నిర్వహించారు. మొదటగా విద్యార్థులచేత సత్య ప్రమాణం గావాంచిన తర్వాత పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్స్ పాల్ మధు మాట్లాడుతూ …. ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే ఉన్నత స్థితికి చేరగానే పిల్లలు వారిని మరిచిపోతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయలేనివాడు సృష్టిలోని ఆలయాలన్నింటినీ దర్శించుకున్నా పుణ్యం లభించదని తెలిపారు. ఇంట్లో ఉండే దేవతలను పూజించాలన్నారు.

ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికీ కృతజ్ఞతలు తెలుపూతూ….. రాష్ట్రంలో ని మిగతా పాఠశాలలో కూడ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Reporter : G.Peddeesh, Tv9 Telugu

Also Read: Madhya Pradesh: రెండు తలలు, మూడు చేతులతో వింత బేబీ జననం.. చిన్నారి పరిస్థితి విషమం

News Watch: ఎండల్లో తిరగద్దు… ఆరెంజ్ హెచ్చరికలు… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?