వామ్మో.. బాత్రూమ్‌లో అద్దం ఈ దిశలో ఉంటే కోటీశ్వరులు కూడా రోడ్డున పడాల్సిందేనా.. ఈ విషయాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
Vastu Tips: ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయా..? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా..? అయితే మీ బాత్రూమ్ అద్దాన్ని ఒకసారి గమనించండి. వాస్తు ప్రకారం బాత్రూంలో అద్దం ఉంచడానికి కొన్ని కచ్చితమైన నియమాలు ఉన్నాయి. తప్పుడు దిశలో ఉంచిన అద్దం ఇంట్లో ఒత్తిడిని, అశాంతిని పెంచుతుంది. అద్దం ఎటువైపు ఉండాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది ఇళ్లలో వాస్తు అనగానే కేవలం పూజ గది, వంట గది లేదా బెడ్ రూమ్ దిశల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ మనం నిత్యం ఉపయోగించే బాత్రూమ్ వాస్తు కూడా మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బాత్రూంలో ఉండే అద్దం విషయంలో చేసే చిన్న తప్పులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాత్రూంలో అద్దం ఉండటంలో తప్పు లేదు కానీ అది ఎటువైపు ఉందనేదే ముఖ్యం. బాత్రూమ్‌లో ఉత్తరం లేదా తూర్పు గోడపై అద్దం ఉంచడం అత్యంత శుభప్రదం. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.బాత్రూమ్ తలుపుకు నేరుగా ఎదురుగా అద్దం అస్సలు ఉండకూడదు. తలుపు తీయగానే మన కళ్లు నేరుగా అద్దం మీద పడితే, బయటి నుంచి వచ్చే ప్రతికూల శక్తి తిరిగి ఇంట్లోకి ప్రవహించే అవకాశం ఉంది.
అసలు బాత్రూంలో ఎలాంటి అద్దం వాడాలి?
ఆకారం విషయంలో జాగ్రత్త..
అద్దం అందంగా ఉందని ఏ ఆకారంలో పడితే ఆ ఆకారంలో కొనకూడదు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం..చతురస్రాకార లేదా దీర్ఘచతురస్రాకార అద్దాలు మాత్రమే బాత్రూమ్‌కు శ్రేయస్కరం. ఇవి మన ఆలోచనల్లో సమతుల్యతను, మనశ్శాంతిని పెంపొందించడంలో సహాయపడతాయి. గుండ్రని లేదా అపసవ్య ఆకారంలో ఉన్న అద్దాలను నివారించడం మంచిది.
పగిలిన, మురికి అద్దాలు అరిష్టం
చాలామంది బాత్రూంలో అద్దం పగిలినా లేదా మచ్చలు పడినా పట్టించుకోరు. కానీ విరిగిన లేదా పగిలిన అద్దం ఇంట్లో ఒత్తిడిని, మానసిక అశాంతిని కలిగిస్తుంది. అద్దంపై మురికి పేరుకుపోవడం వల్ల అది ప్రతికూలతను ఆకర్షిస్తుంది. కాబట్టి బాత్రూమ్ అద్దం ఎల్లప్పుడూ మెరుస్తూ, శుభ్రంగా ఉండాలి. ఒకవేళ అద్దం దెబ్బతింటే వెంటనే మార్చేయడం ఉత్తమం.
అపోహలు వద్దు.. నిపుణుల మాట..
బాత్రూంలో అద్దం పెట్టడం వల్ల కష్టాలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. కానీ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అది కేవలం అపోహ మాత్రమే. పైన చెప్పిన విధంగా సరైన దిశ, సరైన ఆకారం, శుభ్రతను పాటిస్తే ఆ అద్దం మీకు ఎటువంటి హాని చేయదు సదా సానుకూల ఫలితాలనే ఇస్తుంది.
(Note: ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)
