Kalady Sri Adi Shankara Madom: అక్టోబర్ 19న ఆది శంకరాచార్య మఠంలో బాలజ్యోతి ప్రారంభోత్సవం.. భక్తులకు ప్రత్యేక ఆహ్వానం
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్రిక కేంద్రం శ్రీ కాలడి ఆదిశంకర మఠంలో బాలజ్యోతి గ్రాండ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 19, 2025 (ఆదివారం ) ఉదయం 10:30 గంటలకు మడోమ్ ప్రాంగణంలో జరగనుంది. ఇందులో పాల్గొనడానికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేయాలని..

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీ ఆది శంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తున్న పవిత్ర స్వర్గధామం తెలంగాణలోని శ్రీ కాలడి ఆదిశంకర మఠం. ఇది ఆది శంకరాచార్యుల బోధనలను వివిధ కార్యక్రమాల ద్వారా సమాజానికి అందించడానికి కృషి చేస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన దైవిక జ్ఞానం, తత్వాలను ప్రచారం చేస్తూ.. ప్రజలకు ఆధ్యాత్మికత గొప్పదనాని అందించే ప్రయత్నం చేస్తోంది. కాలడి శ్రీ ఆదిశంకర మఠం.. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొలారంలో ఉంది.
ఇక్కడ బాలజ్యోతి గ్రాండ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంల అక్టోబర్ 19, 2025 (ఆదివారం ) ఉదయం 10:30 గంటలకు మడోమ్ ప్రాంగణంలో జరగనుంది. ఇందులో పాల్గొనడానికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేయాలని మఠం నిర్యాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ ప్రారంభోత్సవం ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. ఆ తరువాత అన్న ప్రసాదం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని సికింద్రాబాద్ కౌకూర్ గ్రామం బోలారంలోని వెంకుసా ఎస్టేట్స్ నిర్వహిస్తారు.
ఇతన వివరాలకు సంప్రదించండి..
ఇతర సమాచారం కోసం సంప్రదించవల్సిన ఫోన్ నంబర్: 8350903080
ఇక్కడికి చేరుకోవడనాకి గూగుల్ మ్యాప్ లొకేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇతర వివరాలకు కలాడి శ్రీ ఆది శంకర మఠం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




