మరికాసేపట్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం
మంగళవారం మధ్యాహ్నం నుంచి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగనుంది. ఇప్పటికే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను పర్యటన ప్రారంభం కానుంది. విజయనగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురు గుడి నుంచి కోట వరకు సిరిమాను మూడు సార్లు సంచరించరించనుంది.

ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరికలు తీర్చే కల్పవల్లి విజయనగరం వాసుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు రెడీ అయింది. సిరిమానును దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు ఝార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను పర్యటన ప్రారంభం కానుంది. విజయనగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురు గుడి నుంచి కోట వరకు సిరిమాను మూడు సార్లు సంచరించరించనుంది.
సిరిమానును ఆలయ ప్రధాన పూజారి వెంకటరావు అధిరోగించనున్నారు. సంప్రదాయబద్ధంగా కోట బురుజు పై నుంచి సిరిమానును దర్శించనున్న గజపతిరాజుల వారసులు అశోక్ గజపతి రాజు సహా కుటుంబ సభ్యులు. మరోవైపు పూర్వ అర్బన్ బ్యాంక్ ప్రదేశం నుంచి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్సకు సిరిమాను దర్శించేలా ఏర్పాటు చేశారు.
సిరిమాను సంబరంలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం పది గంటలకు పైడి తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమర్పించారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగనుంది. ఇప్పటికే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. మరోవైపు పైడితల్లి అమ్మవారి ఆలయానికి వి ఐ పి ల తాకిడి పెరిగింది. దీంతో సామాన్య భక్తుల దర్శనాలను నిలిపివేసి వీఐపీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యులు క్యూలైన్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉపవాసం ఉన్న భక్తుల పరిస్థితి దయనీయంగా ఉంది. గర్భాలయంలో వీఐపీల దర్శనం చేసుకోవడం వలన సాథారణ భక్తులకు అమ్మవారి దర్శనం సరిగా లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




