Ayodhya Mandir: శరవేగంగా భవ్య రామమందిర నిర్మాణపనులు.. భక్తులకు దర్శనాలు ఎప్పటినుంచంటే?
Ayodhya Ram Mandir construction: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ పునాధుల నిర్మాణానికి సంబంధించిన ఫేస్-1 సెప్టెంబర్ మాసంలో ముగిశాయి.
Ayodhya Temple: అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ పునాధుల నిర్మాణానికి సంబంధించిన ఫేస్-1 పనులు సెప్టెంబర్ మాసంలో ముగియగా.. ఫేస్-2 పనులు నవంబరు మాసంలో ముగియనున్నాయి. దేశ ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయ దశమి వేడుకలు జరుపుకుంటున్న వేళ అయోధ్య రామాలయ నిర్మాణపనులు చేపడుతున్న రామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు ఓ తీపికబురు చెప్పింది. భవ్య రామమందిర దర్శనానికి భక్తులను ఎప్పటి నుంచి అనుమతిస్తారన్న అంశంపై రామ జన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ ఛంపత్ రాయ్ ప్రకటన చేశారు. 2023 డిసెంబరు చివరినాటి నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. ఆ మేరకు 2023లో ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్టాపన చేయాలని ట్రస్ట్ భావిస్తున్నట్లు తెలిపారు.
ఆలయ నిర్మాణ పనుల్లో పురోగతి సంతృప్తిని కలిగిస్తున్నట్లు ఛంపత్ రాయ్ తెలిపారు. రామ మందిర నిర్మాణంలో అత్యుత్తమ ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లు పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు ఇదే రీతిలో కొనసాగితే 2023 డిసెంబరు చివరినాటికి రామమందిర తలుపులు భక్తుల కోసం తెరుచుకుంటాయని వ్యాఖ్యానించారు. నవంబరులో రెండో దశ పనులు ముగిసిన తర్వాత.. ఆలయ ఫ్లోర్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
రామజన్మభూమి ట్రస్ట్ ట్వీట్..
The construction work of Shri Ram Janmabhoomi Mandir is continuing with fast pace. Devotees will be able to have darshans of Bhagwan in the Garbha Gruha from December 2023.
First phase of foundation work is over, while second phase will be over by Mid November.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 14, 2021
అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 2.77 ఎకరాల విస్తీర్ణంలో 161 అడుగుల ఎత్తులో మందిరాన్ని నిర్మించనున్నారు. గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అయోధ్య రామాలయ భమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం తెలిసిందే.
Also Read..
Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..
Viral Video: ఈ చిలుక చూడండి.. అప్పడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! వీడియో