Ayodhya: అయోధ్యలో తెల్ల రాయితో చేసిన రామ్‌లాలా విగ్రహం.. ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలుసా?
అయోధ్యలో ఎటుచూసినా రామనామ సంకీర్తనలు.. ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తోంది.. ఎక్కడ చూసినా రామనామమే. రామ భజనలే...గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. అయోధ్య రామాలయం ప్రాంగణం జై శ్రీరాం నినాదం మార్మోగిపోతుంది. అయోధ్య అంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది..

అయోధ్యలో ఎటుచూసినా రామనామ సంకీర్తనలు.. ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తోంది.. ఎక్కడ చూసినా రామనామమే. రామ భజనలే…గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. అయోధ్య రామాలయం ప్రాంగణం జై శ్రీరాం నినాదం మార్మోగిపోతుంది. అయోధ్య అంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది.. మంగళవారం నుంచి అయోధ్య బాలరాముడు సాధారణ భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఆ సుందరమైన, మనోహరమైన ఆ బాలరాముడి రూపం చూసి భక్తులు తరించిపోతున్నారు. అయోధ్య ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆ బాలరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు చేరుకున్నారు..
అయితే రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించేందుకు మూడు విగ్రహాలను తయారు చేశారు. గ్రంధాలు, రామాయణంలో రాముడు ముదురు రంగుతో వర్ణించబడ్డాడు. ఈ కారణంగా, రామాలయంలోని గర్భగుడిలో నలుపు రంగు రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదే సమయంలో తెల్లరాతితో మరో విగ్రహాన్ని తయారు చేసింది రామమంది ట్రస్ట్. అయితే ఆ తెల్లరాతి రాంలాలా విగ్రహం ఏమైందన్న ప్రశ్నలు జనాల్లో తలెత్తుతున్నాయి.
రాజస్థాన్ శిల్పి సత్య నారాయణ్ పాండే రాంలాలా విగ్రహాన్ని తెల్లని రాతితో తయారు చేశారు. ఈ విగ్రహాన్ని మొదటి అంతస్తులో ఉంచుతారన్న ప్రచారం జరుగుతోంది. తెల్లటి రంగులో ఉన్న రాంలాలా విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రామభక్తుడు హనుమంతుడు రాంలాలా విగ్రహం పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. విగ్రహం చుట్టూ శ్రీహరి దశావతారాలను చిత్రీకరించారు. ఇది విష్ణువు అవరాల్లోని మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను వర్ణిస్తుంది.
ఇక మూడో విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన గణేష్ భట్ తయారు చేశారు. ఈ విగ్రహం కూడా సిద్ధంగా ఉంది. అయితే దీని చిత్రాన్ని ఇంకా వెల్లడించలేదు. ఈ విగ్రహాన్ని కూడా రామ మందిరంలో మాత్రమే ప్రతిష్టించవచ్చని తెలుస్తోంది. గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహం. దీనిని అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. అందరిలాగే పిల్లల రూపంలో ఉన్న ఈ విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందట.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
