Tirumala: మరి కాసేపట్లో సీఎం హోదాలో తిరుపతికి చంద్రబాబు.. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి
ఈ రోజు సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7.50 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్నారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో పయనించి రాత్రి 8.50 గంటలకు తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రి తిరుమలలోని అతిధి గృహంలోనే బస చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరి కాసేపట్లో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి వెళ్లనున్నారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7.50 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్నారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో పయనించి రాత్రి 8.50 గంటలకు తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రి తిరుమలలోని అతిధి గృహంలోనే బస చేయనున్నారు.
రేపు (గురువారం) ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందు శ్రీ భూ-వరాహ స్వామి ఆలయాన్ని సందర్శించానున్నారు. అనంతరం 7.30 నుంచి 8 గంటలలోపు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. స్వామిని తమ కుటుంబ సభ్యులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరుగు పయనం కానున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు సిఎం చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకుని.. అక్కడ నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు. సిఎం పర్యటన నేపధ్యంలో ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. రహదారులను, తిరుమల ఘాట్ రోడ్లలో స్పెషల్ పోలీసు బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి శ్రీవారిని దర్శించుకోనున్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
74 ఏళ్ల చంద్రబాబు నాయుడు మంగళవారం ఎన్‌డిఎ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు తొలిసారిగా 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 వరకు వరుసగా తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నాయకత్వం వహించారు. మళ్ళీ 2014లో కొత్తగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి.. 2019 వరకు పని చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..