AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మార్కెట్‌లో అడుగు పెట్టిన సరికొత్త కాఫీ.. ఉల్లికాడలతో వింత కాఫీ.. తెగ తాగేస్తున్న చైనీయులు..

ఇప్పటి వరకూ పాలతో చేసిన కాఫీమాత్రమే కాదు.. బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ, ఐస్ కాఫీ, చాక్లెట్ కాఫీ ఇలా చాలా రకాల కాఫీలు తాగి ఉండవచ్చు. అయితే ప్రస్తుతం ఉల్లి కాడలతో తయారు చేసిన కాఫీ బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం చైనాలో ఉల్లి కాడలతో చేసిన లాట్ కాఫీ బాగా ప్రాచుర్యం పొందుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ వింత కాఫీ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: మార్కెట్‌లో అడుగు పెట్టిన సరికొత్త కాఫీ.. ఉల్లికాడలతో వింత కాఫీ.. తెగ తాగేస్తున్న చైనీయులు..
Spring Onion Coffee
Surya Kala
|

Updated on: Jun 12, 2024 | 3:55 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టంగా తాగే పానీయం టీ లేదా కాఫీ. ఇవి లేకుండా కొంతమందికి రోజు మొదలవదు. ఉదయం లేదా సాయంత్రం టీ లేదా కాఫీ పడాల్సిందే. ముఖ్యంగా కాఫీ గురించి మాట్లాడితే.. రిఫ్రెష్ కు కేరాఫ్ అడ్రస్ కాఫీ. విదేశాల్లోని చాలా మంది ప్రజలు కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఎస్ప్రెస్సో, కాపుచినో, లాట్ వంటి అనేక రకాల కాఫీలు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రజలు వంటలతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అదే విధంగా కాఫీతో కూడా వివిధ రకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇలాంటి ప్రయోగమే ఈ రోజుల్లో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని ప్రజలు ఉల్లిపాయలతో కాఫీ తయారు చేసి తాగుతున్నారు.

ఇప్పటి వరకూ పాలతో చేసిన కాఫీమాత్రమే కాదు.. బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ, ఐస్ కాఫీ, చాక్లెట్ కాఫీ ఇలా చాలా రకాల కాఫీలు తాగి ఉండవచ్చు. అయితే ప్రస్తుతం ఉల్లి కాడలతో తయారు చేసిన కాఫీ బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం చైనాలో ఉల్లి కాడలతో చేసిన లాట్ కాఫీ బాగా ప్రాచుర్యం పొందుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ వింత కాఫీ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో #springonionlatter అని సెర్చ్ చేస్తే, మీకు డజన్ల కొద్దీ చిత్రాలు, వీడియోలు రెసిపీలను చూడొచ్చు. గత నెలలో అనేక వార్తా ప్లాట్‌ఫారమ్‌లు ఈ వింత కాఫీ వార్తలను కవర్ చేయడంతో మొదటిసారిగా ఈ కాఫీ వైరల్‌గా మారింది. ఇది అత్యంత ఆశ్చర్యకరమైన కలయికలలో ఒకటిగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఉల్లికాడల కాఫీ ఎలా తయారు చేస్తారంటే

View this post on Instagram

A post shared by VTV DIGITAL (@vtv24news)

ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఈ వింత కాఫీని తయారు చేసే విధానం ఏమిటంటే మొదట ఉల్లికాడలను చిన్నగా కట్ చేసి ఒక కప్పులో వేసి కొంచెం మెత్తగా చేసి.. ఆపై ఆ కప్ లో ఐస్, పాలు, కాఫీ డికాక్షిన్ ను జోడించాలి. దీని తరువాత.. కాఫీకి టాపింగ్ గా తరిగిన ఉల్లికాడల ముక్కలు వేయాలి. అంతే ఉల్లికాడల కాఫీ సిద్ధంగా ఉంటుంది. ఈ కాఫీకి ‘స్ప్రింగ్ ఆనియన్ లాట్టే’ అని పేరు పెట్టారు.

కాఫీ తయారు చేయాలనే ఈ ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది? ఇలా కాఫీ తయారు చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ తెలియనప్పటికీ ఈ వింత కాఫీని కొన్ని నెలల క్రితం పలు కాఫీ షాపుల్లో అమ్ముతున్నారు. ఈ వింత కాఫీ జనాల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి వింత కాఫీ వార్తల్లో నిలిచింది. దీనికి ‘హాట్ ఐస్ లాట్’ అని పేరు పెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కాఫీలో కారం కూడా కలిపారు.

ప్రజల ఊహకు అందని కాఫీ

కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న కాఫీని చూసి జనాలు ఫిదా అయిపోయారు. జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఏదో ఒకరోజు ఉల్లికాడలతో చేసిన కాఫీ తాగాల్సి వస్తుందని ఊహించలేదని కొందరు, ఈ ప్రత్యేకమైన కాఫీ చాలా ఆకట్టుకుందని, అయితే నోటి నుంచి వచ్చే ఉల్లి దుర్వాసన గురించి ఆందోళన చెందుతున్నామని మరి కొందరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..