Viral Video: చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని అకస్మాత్తుగా చుట్టేసిన పాము.. ఆ తర్వాత

పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. అకస్మాత్తుగా పాము కనిపిస్తే ఎవరైనా ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. ఆ పేరు వింటేనే కొందరు గజగజ వణికిపోతారు. అయితే ఇప్పుడు తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video: చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని అకస్మాత్తుగా చుట్టేసిన పాము.. ఆ తర్వాత
Snake Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2024 | 4:26 PM

పాము అంటే నూటికి తొంభై మంది భయపడతారు. నిజమైన పామును పక్కనపెట్టండి.. ఫోన్‌లో పాము ఇమేజ్ కనిపించినా.. లేదా దాని బొమ్మ ఎక్కడైనా కనబడినా.. వామ్మో అని కేకలు వేసే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే అన్ని పాములు హానికరమైనవి కావు. కట్ల పాము, నాగు పాము, రక్త పింజర, చిన్నపింజర వంటివి చాలా డేంజర్. ఇవి కాటు వేయడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. ప్రజంట్ రెయినీ సీజన్ నడుస్తోంది. పామలు సంచారం ఎక్కువగా ఉంటోంది. అప్రమత్తంగా లేకపోతే.. ప్రాణాలకే ముప్పు ఉంటుంది.  తాజాగా పాముకు సంబంధించిన డేంజరస్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  ఈ వీడియో చూసిన తర్వాత ఆ వ్యక్తి పాముకు అలా ఎలా చిక్కాడో అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. పాము అతడిని పూర్తిగా చుట్టుకుని.. ముఖంవైపు వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది.

ముందుగా వీడియో చూడండి… 

వైరల్ అవుతున్న వీడియో పరిశీలించినట్లైతే.. పొలంలో ఓ వ్యక్తి చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇంతలో ఏమైందో గాని అతడి కాలుకు పాము వచ్చి చుట్టేసుకుంది. దీంతో ఏం చేయాలో తెలియక భయంతో బెంబేలెత్తిపోయాడు. వామ్మో.. వామ్మో అంటూ అరుపు లఖించుకున్నాడు. పాము రెండు కాళ్లకు చుట్టేసుకొని అతడి మీదకు వెళ్లే ప్రయత్నం చేయడం మీరు వీడియోలో చూడవచ్చు.  కాళ్ల చుట్టూ పాము చుట్టుకోవడం వల్ల అతడు అక్కడి నుంచి లేచే సాహసం చేయలేదు. యువకుడి కాళ్లపై పాము పాకుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా ఉన్నాయి.  ఈ ఘటనపై వీడియో పూర్తిగా లేదు, కొంత వరకే రికార్డ్ చేశారు. చివరకు ఏం జరిగిందో తెలియలేదు. ఆ తర్వాత ఆ వీడియో తీసినవాళ్లు అతడిని కాపాడే ప్రయత్నం చేసి ఉండవచ్చు.

నెటిజన్లు చాలా మంది అతడు మద్యం మత్తులో ఉన్నాడని అనుమానిస్తున్నారు.  ఈ వ్యక్తి నటిస్తున్నాడని, వీడియో తీయడానికి ఇలా చేశాడని ఒకరు కామెంట్ పెట్టారు. ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ అయింది. పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి