AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ రోజుల్లో మరిన్ని శుభాలు..!

Sri Hanuman Tandava Stotram: శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పారాయణం ద్వారా శారీరక బలం, మానసిక ధైర్యం, తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయి. భక్తుల న్యాయమైన కోరికలు నెరవేరే మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం ఈ స్తోత్రాన్ని పఠించడం వలన విశేషమైన శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ రోజుల్లో మరిన్ని శుభాలు..!
Hanuman
Rajashekher G
|

Updated on: Feb 07, 2026 | 8:00 AM

Share

హిందూ దేవుళ్లలో హనుమంతుడి పేరు వినగానే ఏదో తెలియని బలం, ధైర్యం వస్తుంది. అనేక శుభాలను కలిగించడంతోపాటు ప్రతికూల ఫలితాలను పారద్రోలే దేవుడిగా హనుమంతుడికి పేరుంది. హనుమంతుడి ప్రత్యేక శుభ దృష్టి కోసం ఒక స్తోత్రం ఉంది. అదే శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం. శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం అనేది శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠించడం వలన జీవితంలోని కష్టాలు తగ్గుతాయి, భయాలు తొలగిపోతాయి. మనసుకు శాంతి లభిస్తుంది. భక్తులు ఎదుర్కొనే సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

ఈ స్తోత్ర పారాయణం ద్వారా శారీరక బలం, మానసిక ధైర్యం, తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయి. భక్తుల న్యాయమైన కోరికలు నెరవేరే మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం ఈ స్తోత్రాన్ని పఠించడం వలన విశేషమైన శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు:

శత్రువుల భయం తొలగి, ప్రతికూల శక్తులు నశిస్తాయి. మానసిక, శారీరక బలం పెరిగి ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. తీరని కోరికలు నెరవేరుతాయి. గ్రహబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. శని సాడే సతి, క్షుద్ర ప్రభావం వంటి ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడి, దుఃఖం, బాధలు క్రమంగా తొలగిపోతాయి. కష్టాల నుంచి విముక్తి లభించడంతోపాటు అనేక శుభ ఫలితాలు పొందుతారు.

శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం

వందే సిందూరవర్ణాభం లోహితాంబరభూషితమ్ | రక్తాంగరాగశోభాఢ్యం శోణపుచ్ఛం కపీశ్వరమ్ || 1 ||

భజే సమీరనందనం సుభక్తచిత్తరంజనం దినేశరూపభక్షకం సమస్తభక్తరక్షకం | సుకంఠకార్యసాధకం విపక్షపక్షబాధకం సముద్రపారగామినం నమామి సిద్ధకామినం || 1 || సుశంకితం సుకంఠముక్తవాన్ హి యో హితం వచ- -స్త్వమాశు ధైర్యమాశ్రయాత్ర వో భయం కదాపి న | ఇతి ప్లవంగనాథభాషితం నిశంయ వానరా- -ఽధినాథ ఆప శం తదా స రామదూత ఆశ్రయః || 2 || సుదీర్ఘబాహులోచనేన పుచ్ఛగుచ్ఛశోభినా భుజద్వయేన సోదరౌ నిజాంసయుగ్మమాస్థితౌ | కృతౌ హి కోసలాధిపౌ కపీశరాజసన్నిధౌ విదేహజేశలక్ష్మణౌ స మే శివం కరోత్వరం || 3 || సుశబ్దశాస్త్రపారగం విలోక్య రామచంద్రమాః కపీశనాథసేవకం సమస్తనీతిమార్గగం | ప్రశస్య లక్ష్మణం ప్రతి ప్రలంబబాహుభూషితః కపీంద్రసఖ్యమాకరోత్ స్వకార్యసాధకః ప్రభుః || 4 || ప్రచండవేగధారిణం నగేంద్రగర్వహారిణం ఫణీశమాతృగర్వహృద్దశాస్యవాసనాశకృత్ | విభీషణేన సఖ్యకృద్విదేహజాతితాపహృత్ సుకంఠకార్యసాధకం నమామి యాతుఘాతుకం || 5 || నమామి పుష్పమాలినం సువర్ణవర్ణధారిణం గదాయుధేన భూషితం కిరీటకుండలాన్వితం | సుపుచ్ఛగుచ్ఛతుచ్ఛలంకదాహకం సునాయకం విపక్షపక్షరాక్షసేంద్రసర్వవంశనాశకం || 6 || రఘూత్తమస్య సేవకం నమామి లక్ష్మణప్రియం దినేశవంశభూషణస్య ముద్రికాప్రదర్శకం | విదేహజాతిశోకతాపహారిణం ప్రహారిణం సుసూక్ష్మరూపధారిణం నమామి దీర్ఘరూపిణం || 7 || నభస్వదాత్మజేన భాస్వతా త్వయా కృతామహాసహా- -యతా యయా ద్వయోర్హితం హ్యభూత్ స్వకృత్యతః | సుకంఠ ఆప తారకాం రఘూత్తమో విదేహజాం నిపాత్య వాలినం ప్రభుస్తతో దశాననం ఖలం || 8 || ఇమం స్తవం కుజేఽహ్ని యః పఠేత్ సుచేతసా నరః కపీశనాథసేవకో భునక్తి సర్వసంపదః | ప్లవంగరాజసత్కృపాకటాక్షభాజనః సదా న శత్రుతో భయం భవేత్కదాపి తస్య నుస్త్విహ || 9 || నేత్రాంగనందధరణీవత్సరేఽనంగవాసరే | లోకేశ్వరాఖ్యభట్టేన హనుమత్తాండవం కృతం || 10 || ॥ ఇతి శ్రీ హనుమత్తంద్వస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Follow Us