Amarnath Yatra 2023: జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. పుణ్యక్షేత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
Amarnath Yatra 2023: భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాలలో అమర్‌నాథ్ యాత్ర ఒకటి. సముద్ర మట్టానికి 13,600 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రానికి తీర్థయాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు..
Amarnath Yatra 2023: భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాలలో అమర్‌నాథ్ యాత్ర ఒకటి. సముద్ర మట్టానికి 13,600 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రానికి తీర్థయాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు సాగుతుంది. మొత్తం 62 రోజుల పాటు కొనసాగే ఈ అమర్‌నాథ్ యాత్రకు ఏప్రిల్ 17న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక సాక్షత్ ఆదిపురుషుడైన శివుడు కొలువై ఉన్న ఈ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
- అమర్‌నాథ్ ఆలయం అనేది జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఓ హిందూ దేవాలయం. అమర్నాథ్ గుహ సముద్రమట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ క్షేత్రం పహల్గామ్ నుంచి 45 కి.మీ.. శ్రీనగర్ నుంచి 141 కి.మీ దూరంలో ఉంది.
- అబుల్ ఫజల్ తన అమర రచన ‘ఐన్-ఎ-అక్బర్’లో ఈ ఆలయం గురించి ‘ఆధ్యాత్మిక యాత్రికుల కోసం ఈ ప్రదేశం ఒక గొప్ప గమ్యస్థానం’ అని పేర్కొన్నాడు.
- స్వామి వివేకానంద 1898లో ఈ గుహను సందర్శించి దాని అందాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. దాని సందర్శనల వివరాలను ‘స్వామి వివేకానందతో కొన్ని సంచారాల గమనికలు’ చూడవచ్చు.
- కొంతమంది శివ భక్తులు అమర్‌నాథ్ యాత్రను స్వర్గానికి మార్గంగా భావిస్తారు. మరికొందరు దీన్ని మోక్ష స్థలం అని కూడా పిలుస్తారు.
- 11వ శతాబ్దానికి చెందిన రాణి సూర్యమతి ఆలయానికి త్రిశూలాలు, బాణ లింగాలు, ఇతర పవిత్ర చిహ్నాలను బహుమతిగా ఇచ్చిందని స్థానికులు చెబుతుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..