Vastu Tips: మెట్ల విషయంలో ఈ తప్పులు చేశారా.? ఆర్థిక ఇబ్బందులు తప్పవు..
వాస్తులో ప్రధానంగా ప్రస్తావించే అంశాల్లో ఇంట్లో నిర్మించే మెట్లు కూడా ఒకటి. కొందరు స్థలం సరిపోకో మరే కారణంతోనో సరైన దిశలో మెట్లను నిర్మించుకోరు. అయితే ఇలా తెలిసో తెలియకో మెట్లను సరైన దిశలో నిర్మించకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మెట్లు సరైన స్థానంలో లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు...

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు ఆధారంగా ఇంటిని నిర్మించుకునే వారు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి. అందుకే ఇంటి పునాది మొదలు గదుల నిర్మాణం వరకు అన్నింటిలో వాస్తు నియమాలను పాటిస్తుంటారు. అందుకే వాస్తు శాస్త్రంలో ఎన్నో అంశాలను ప్రస్తావించారు.
వాస్తులో ప్రధానంగా ప్రస్తావించే అంశాల్లో ఇంట్లో నిర్మించే మెట్లు కూడా ఒకటి. కొందరు స్థలం సరిపోకో మరే కారణంతోనో సరైన దిశలో మెట్లను నిర్మించుకోరు. అయితే ఇలా తెలిసో తెలియకో మెట్లను సరైన దిశలో నిర్మించకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మెట్లు సరైన స్థానంలో లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అందుకే మెట్ల నిర్మాణం సరైన దిశలో నిర్మించాలని చెబుతున్నారు.
మెట్లను నిర్మించే క్రమంలో కచ్చితంగా కొన్ని వాస్తు నియాలను పరిగణలోకి తీసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ఆధారంగా మెట్ల నిర్మాణం చేసుకుంటే కుటుంబంలో సంతోషం ఉంటుంది. సరైన దిశలో మెట్లు నిర్మిస్తే ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. జీవితంలో పురోగతికి మార్గం సుగమమవుతుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో మెట్లు నిర్మిస్తే ఏమవుతుంది.? ఏ దిశలో మెట్ల నిర్మాణం చేపట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్తు ప్రకారం ఈశాన్య దిశలో మెట్లు నిర్మించకూడదుని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈశాన్యంలో బాత్‌రూమ్‌తో పాటు మెట్లు కూడా ఉండకూడదు. ఈశాన్యంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య, వ్యాపార సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆగ్నేయ దిశలో కూడా మెట్లు నిర్మించకూడదు. ఆగ్నేయ దిశలో మెట్లు ఉంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇక మెట్లు అన్ని ఒకే విధంగా ఉండాలి. ఒక మెట్టు ఎక్కువ, ఒక మెట్టు తక్కువ ఉండకూడదు. మెట్లలో తేడా ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక మెట్ల సంఖ్య ఎప్పుడు బేసిగానే ఉండాలి. ఒకవేళ మెట్లు సరి సంఖ్యలో ఉంటే దురదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇక మెట్ల కింద ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..
