AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRTP: మంగళవార సమరంలో భాగం, వనపర్తి చేరుకున్న షర్మిల.. తాడిపత్రిలో నిరుద్యోగ నిరహార దీక్ష

ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం ఉద్యోగ దీక్ష చేస్తానని ప్రకటించిన వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల కార్యోన్ముఖరాలయ్యారు...

YSRTP: మంగళవార సమరంలో భాగం, వనపర్తి చేరుకున్న షర్మిల.. తాడిపత్రిలో నిరుద్యోగ నిరహార దీక్ష
Ys Sharmila
Venkata Narayana
|

Updated on: Jul 13, 2021 | 9:35 AM

Share

YS Sharmiala – Tadipatri: ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం ఉద్యోగ దీక్ష చేస్తానని ప్రకటించిన వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల కార్యోన్ముఖరాలయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టారు. ఈ ఉదయం వనపర్తి జిల్లాకు చేరుకున్న షర్మిల.. నిరుద్యోగి కొండల్ ఫ్యామిలీని పరామర్శించి తాడిపత్రిలో నిరుద్యోగ నిరహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

తాడిపత్రి గ్రామానికి చెందిన కొండల్ అనే బి.ఎడ్ గ్రాడ్యుయేట్ నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మంగళవారం దీక్షకు హాజరై మద్దతు పలకాలని షర్మిల పార్టీ అడహాక్‌ కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.

పీఆర్సీ నివేదిక ప్రకారం తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందని.. ఉద్యోగం కోసం వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగి కొండల్‌ మంత్రి నిరంజన్‌రెడ్డి చుట్టూ పదే పదే తిరిగి విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల పార్టీ ఆరోపిస్తోంది. మంత్రి మొసలికన్నీరు కారుస్తూ కొండల్‌ కు టుంబాన్ని పరామర్శించడాన్ని ఆపార్టీ ఆక్షేపిస్తోంది.

Read also: Jampannavagu: ఉధృతంగా ప్రవహిస్తోన్న జంపన్నవాగు.. ఇంకా తెలీని ఇద్దరి ఆచూకీ.. ఇవాళా కొనసాగుతోన్న గాలింపు