Badvel By Election: బద్వేల్ ప్రచారంలో అధికార పార్టీ దూకుడు.. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతల మోహరింపు

బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతలు వచ్చి బద్వేల్‌లో ప్రచారం

Badvel By Election: బద్వేల్ ప్రచారంలో అధికార పార్టీ దూకుడు.. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతల మోహరింపు
Mla Roja
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 26, 2021 | 4:52 PM

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతలు వచ్చి బద్వేల్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ నియోజయవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఓటర్లు వైసీపీకే మద్దతు తెలుపుతున్నారని.. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందాయని ఆయన చెప్తున్నారు. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతుందని చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని.. తమకు ఆ అవసరం లేదంటున్న చెవిరెడ్డి.. కేంద్ర బలగాలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తామని చెప్తున్నారు.

బద్వేల్‌ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని, వారు ప్రజల మన్ననలను చూరగొన్నారన్నారు. చిత్తూరు జిల్లా నుంచి కూడా ఇద్దరు సీఎంలుగా పని చేశారని, ఒకర మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయయారని, మరొకరైన కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా వాసులు ఇక్కడి సీఎంలను చూసి గర్వపడాలన్నారు.

మరోవైపు, బద్వేల్ లో ఇవాళ ఎమ్మెల్యే రోజా సైతం ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్పుకొచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానాన్ని బద్వేల్‌ ఉప ఎన్నికలో చూపించాలని అభ్యర్థించారు.

మహిళా సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని, వైయస్‌ఆర్‌సీపీకి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పిలుపునిచ్చారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.

బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గోపవరం మండలం రాచాయపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Read also: Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!