AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయంగా మా నాన్న హత్యను వాడుకోవాలనుకుంటున్నారు

రాజకీయంగా తన నాన్న హత్యను వాడుకోవాలని చూస్తున్నారని దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిసిన ఆమె తన తండ్రి హత్య కేసు విచారణను ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్ర పోలీసులు చేపట్టే విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావని, అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆమె విన్నవించారు. అనంతరం మాట్లాడుతూ.. మా నాన్న హత్య కేసు […]

రాజకీయంగా మా నాన్న హత్యను వాడుకోవాలనుకుంటున్నారు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 2:58 PM

Share

రాజకీయంగా తన నాన్న హత్యను వాడుకోవాలని చూస్తున్నారని దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిసిన ఆమె తన తండ్రి హత్య కేసు విచారణను ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్ర పోలీసులు చేపట్టే విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావని, అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆమె విన్నవించారు.

అనంతరం మాట్లాడుతూ.. మా నాన్న హత్య కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని సునీల్ అరోరాను కోరినట్లు తెలిపారు. కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, డీజీపీకి వివరాలు అందిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో జగన్‌పై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖను కలవాలని ఈసీ తమకు సూచించిందని ఈ సందర్భంగా సునీతా పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖను కలిసి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరబోతున్నాం అంటూ ఆమె తెలిపారు.

Follow Us