AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు.. జిమ్‌కు వెళ్లే యూత్‌కు పోలీసుల కీలక సూచనలు!

ఈ మధ్య కాలంలో జిమ్‌ వెళ్లే చాలా మంది యూత్ కండల పెరిగేందుకు ఎక్కవగా ప్రోటీన్ పౌడర్, స్లెరాయిడ్స్ వంటి సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువత ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కుల్సుంపురా ఏసీపీ ఆధ్వర్యంలో నాలుగు జిమ్‌లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి వివిధ అంశాలను పరిశీలించారు.

Hyderabad: వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు.. జిమ్‌కు వెళ్లే యూత్‌కు పోలీసుల కీలక సూచనలు!
Hyderabad Gym Raids
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 18, 2026 | 12:30 PM

Share

జిమ్‌లలో వ్యాయామం చేస్తున్న యువకులు ప్రోటీన్ సప్లిమెంట్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లేదా ఇతర పనితీరు పెంచే మందులను వినియోగిస్తున్నారా అనే విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే జిమ్ సభ్యుల నమోదు వివరాలు, ట్రైనర్ల అర్హతలు, వినియోగంలో ఉన్న సప్లిమెంట్ల నాణ్యత, సంబంధిత అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సమగ్రంగా పరిశీలించారు. యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తిని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆరోగ్యానికి హానికరమైన లేదా నిషేధిత పదార్థాల వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ముఖ్యంగా స్టెరాయిడ్లు, అనధికారిక సప్లిమెంట్ల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పళ్ళు జిమ్లలో దొరికిన సప్లిమెంట్ పౌడర్స్ తోపాటు టాబ్లెట్లు గుర్తించారు. మెడికల్ షాపులో ఉండాల్సిన టాబ్లెట్లు జములలో ఎందుకు ఉన్నాయని వీటిని స్టెరాయిడ్స్ రూపంలో వినియోగించడం చట్టబద్ధతేనా వీటి కొనుగోలుకు ప్రెస్క్రిప్షన్ అవసరమా అనే అంశాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీ చేయించి స్టెరాయిడ్స్ వాడుతున్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. సభ్యుల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయడం, అర్హత కలిగిన ట్రైనర్లను నియమించడం, నాణ్యమైన, అనుమతి పొందిన సప్లిమెంట్లను మాత్రమే వినియోగించేందుకు ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.యువతను ప్రమాదకరమైన పదార్థాల బారిన పడకుండా కాపాడడం, ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us