AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair wash: రోజూ తల స్నానం చేస్తున్నారా?.. మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి

ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నప్పటికీ మీ జుట్టు పొడిగా మారిపోతూ, చిక్కుబడుతోందా? అయితే తప్పు మీ తప్పు మీ షాంపూలో లేదు. జుట్టు సంరక్షణ కోసం మీరు వాడే పద్దతిలో ఉంది. అవును సరైన విదానంలో జుట్టు సంరక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం పదండి.

Hair wash: రోజూ తల స్నానం చేస్తున్నారా?.. మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
How Often To Wash Hair
Anand T
|

Updated on: Jun 18, 2026 | 12:08 PM

Share

మీరు రోజూ స్నానం చేస్తున్నప్పటికీ.. మీ జుట్టు పొడిబారినట్టు ఉంటుందా. దానికి మెయిన్ రీజన్ మీరు జుట్టును సంరక్షణలో చేసే తప్పులే అని నిపుణులు అంటున్నారు. అవును నారాయణ ఆర్‌ఎన్ ఠాగూర్ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అరుణిమ రాయ్ ప్రకారం.. మన దేశంలో నివసించే వారి జుట్టు మీడియం నుండి హై పోరోసిటీని కలిగి ఉంటుంది. మనం రోజూ తల స్నానం చేయడం వల్ల మన స్కాల్ప్‌లో ఉండే సహజ నూనెలు కోల్పోయి జుట్టు త్వరగా పొడిగా మారుతుందని చెబుతున్నారు. అయితే తల స్నానాన్ని తగ్గించడం మాత్రమే దీనికి మార్గం కాదని..రోజూ షాంపూ చేసినప్పటికీ మీ స్కాల్ప్ జిడ్డుగా అనిపిస్తే, మీరు మీ జుట్టు, స్కాల్ప్ రకానికి సరిపడని ఉత్పత్తులను వాడుతున్నారని అర్థం.

స్కాల్ప్ రకం vs జుట్టు రకం

సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జాలీ చందా ప్రకారం, చాలా మంది కేవలం తమ జుట్టు రకం పైనే దృష్టి పెడతారు కానీ, స్కాల్ప్ రకాన్ని పట్టించుకోరు. అవును కొందరికి జిడ్డు స్కాల్ప్ ఉండి జుట్టు చివర్లు పొడిగా ఉండవచ్చు, లేదా పొడి స్కాల్ప్ ఉండి జుట్టు చివర్లు జిడ్డుగా ఉండవచ్చు. కాబట్టి జుట్టు మొత్తానికి ఒకే రకమైన ప్రొడక్ట్స్ వాడితే ఫలితం ఉండదని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి

జిడ్డు స్కాల్ప్, పొడి జుట్టు చివర్లు ఉన్నవారు ఆయిల్-కంట్రోలింగ్ షాంపూను, హైడ్రేటింగ్ కండిషనర్ తో కలిపి వాడాలని.. అదే పొడి స్కాల్ప్, జిడ్డు జుట్టు చివర్లు ఉంటే దీనికి రివర్స్ కాంబినేషన్ వాడాలని ఆమె చెబుతున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. షాంపూ అనేది స్కాల్ప్ కోసం, కండిషనర్ అనేది జుట్టు పొడవు, చివర్ల కోసం మాత్రమే యూజ్ చేయాలి.

జుట్టు రకాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి?

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు, ఎండలో, బయట పని చేసేవారు లేదా దుమ్ముకు గురయ్యేవారు ప్రతిరోజూ షాంపూ చేయాల్సి రావచ్చు. అలాంటి వారు మైల్డ్, సల్ఫేట్-ఫ్రీ, పారాబెన్-ఫ్రీ క్లెన్సర్‌లను షాంపూలతో స్నానం చేయడం బెస్ట్.

  • జిడ్డు స్కాల్ప్ – ప్రతిరోజూ లేదా రోజు లేదా రోజు మార్చి రోజు తల స్నానం చేయవచ్చు
  • సాధారణ స్కాల్ప్- నార్మల్ స్కాల్ఫ్ ఉన్న వారు వారానికి రెండు నుండి మూడు సార్లు తల స్నానం చేయొచ్చు
  • పొడి స్కాల్ప్ – పొడి స్కాల్ప్‌ లేదా చాలా కర్లీ హెయిర్ ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండు సార్లు తల స్నానం చేయాలి
  • ఎక్కువగా వ్యాయామం చేసేవారు- అవసరాన్ని బట్టి మరింత తరచుగా చేయవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!