AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alimony Rules: భర్త మరణించిన తర్వాత కూడా మాజీ భార్య భరణం పొందవచ్చా..? చట్టాలు ఏం చెబుతున్నాయంటే..?

భార్య, భర్త విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. కానీ కేసు నడుస్తున్న సమయంలో భర్త మరణించాడు. ఇలాంటి సమయంలో భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుందా..? కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి..? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Alimony Rules: భర్త మరణించిన తర్వాత కూడా మాజీ భార్య భరణం పొందవచ్చా..? చట్టాలు ఏం చెబుతున్నాయంటే..?
Alimony
Venkatrao Lella
|

Updated on: Jun 18, 2026 | 11:40 AM

Share

దేశంలో వివాహ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తోంది. వైవాహిక జీవితం గడుపుతున్న భార్యాభర్తలకు ఈ చట్టాలు వర్తిస్తాయి. చట్టాలు కఠినంగా ఉన్నా.. ఇటీవల దేశవ్యాప్తంగా విడాకుల కేసులు పెరుగుతున్నాయి. కోర్టుకు వచ్చే కేసుల్లో భార్యాభర్తల మధ్య వివాదాలు, విడాకుల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. పెళ్లైన ఏడాదిలోపే చాలా జంటలు వివిధ కారణాల వల్ల విడిపోతున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. కొన్ని కేసులు ఏళ్ల పాటు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. దీని వల్ల ఇద్దరికి సమయం, డబ్బులు వృధా అవుతున్నాయి. ఇక పిల్లలు పుట్టాక కూడా వివిధ కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు.

భర్త మరణించినా భరణం చెల్లించాలా..?

విడాకుల సమయంలో భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ భర్త మరణిస్తే వారి కుటుంబసభ్యులు, వారసుల నుంచి భార్య భరణం కోరవచ్చా? లేదా? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. తాజాగా దీనికి సంబంధించి బాంబే హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెల్లడించింది. భర్త మరణించినా కూడా అతడి ఆస్తి నుంచి భరణం పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుందని తీర్పునిచ్చింది. భర్త కుటుంబసభ్యులు అతడి ఆస్తి నుంచి మాజీ భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే భర్త ఆస్తులు పెరిగితే భరణం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదని తెలిపింది. నరేణ్ గోరెకావోంకర్ అనే వ్యక్తి 2012 మార్చిలో మరణించాడు. అతడు హఠాత్తుగా మరణించడంలో భార్యకు భరణం చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో వర్ష కుటుంబ భరణం కోసం హైకోర్టును ఆశ్రయించింది.

భరణం పెంచేది లేదు..

హైకోర్టు విచారణ అనంతరం భరణం చెల్లించాలని నరేన్ వారసులను ఆదేశించింది. అయితే మాజీ భర్త ఆస్తుల విలువ అప్పటిలో పోలిస్తే ఇప్పుడు పెరగడంతో భరణం పెంచాలని మాజీ భార్య డిమాండ్ చేశారు. కానీ ఈ వాదనను హైకోర్టు తిరస్కరించింది. భర్త ఆస్తుల విలువ పెరిగిందని, వారసులు స్వయంకృషితో సంపాదించుకున్న ఆస్తుల ఆధారంగా భరణం పెంచలేమని న్యాయస్థానం తేల్చేసింది. ప్రస్తుతం ఖర్చులు పెరిగిన క్రమంలో భరణం పెంచాలని మాజీ భార్య డిమాండ్ చేశారు. కానీ అలా పెంచడం కుదరదని జస్టిస్ భారతి, మంజూషా దేవ్ పాండే ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Follow Us