YS Sharmila: చేవెళ్ల నుంచే చెల్లెమ్మ యాత్ర.. టీవీ9 ఎక్స్‌క్లూజివ్.. వైఎస్ఆర్ వచ్చేలా పార్టీ పేరు నిర్ణయం..

షర్మిల మీటింగ్‌పై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. కొత్త పార్టీపై అభిమానులకు దిశానిర్దేశం చేసేందుకే ఈ మీటింగ్‌ పెట్టుకున్నట్టు సమాచారం. వైసీపీకి ఆంధ్ర ముద్ర ఉన్నందునే కొత్త పార్టీ పేరుతో తెలంగాణలోకి వెళ్లాలని భావిస్తున్నాట్టు సన్నిహితుల ...

YS Sharmila: చేవెళ్ల నుంచే చెల్లెమ్మ యాత్ర.. టీవీ9 ఎక్స్‌క్లూజివ్.. వైఎస్ఆర్ వచ్చేలా పార్టీ పేరు నిర్ణయం..
Follow us

|

Updated on: Feb 09, 2021 | 12:19 PM

YS Sharmila : ప్రచారానికి తెరపడుతోంది. అనుకున్నట్టుగానే పార్టీ దిశగా షర్మిల అడుగులేస్తున్నారు. షర్మిల మీటింగ్‌పై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. కొత్త పార్టీపై అభిమానులకు దిశానిర్దేశం చేసేందుకే ఈ మీటింగ్‌ పెట్టుకున్నట్టు సమాచారం. వైసీపీకి ఆంధ్ర ముద్ర ఉన్నందునే కొత్త పార్టీ పేరుతో తెలంగాణలోకి వెళ్లాలని భావిస్తున్నాట్టు సన్నిహితుల సమాచారం. వైఎస్‌ఆర్‌, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు డిసైడ్ చేయనున్నారు.

రానున్న 30 రోజుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. తర్వాత పార్టీ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 100 నియోజకవర్గాల్లో 16నెలల పాటు షర్మిల పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో వైఎస్‌ఆర్ అభిమానులకు ఆమె కాల్ చేసి సమావేశానికి పిలిచారు. వైఎస్‌ఆర్‌ అభిమానులతో ఇవాళ్టి నుంచి ఏకంగా 30 రోజులు భేటీ కానున్నారు. ఈ భేటీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. అలాంటి నినాదాలతో ఫ్లెక్సీని ఏకంగా లోటస్ పాండ్‌కే పెట్టడం హాట్‌ టాపిక్‌ గా మారింది. షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ రాసి పెట్టారు.

షర్మిల మీటింగ్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వైఎస్‌ షర్మిల సమావేశం నల్గొండ జిల్లా నేతలతో మీట్‌ అవుతున్నారు. వైఎస్‌ఆర్‌ అభిమానులు, సన్నిహితులు సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఎలాంటి డైరెక్షన్‌ ఇస్తారు? తెలంగాణలో ఆమె ఏం చేస్తారు? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ఇవాళ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ పెళ్లి రోజు. దీంతో షర్మిల ఈ మీటింగ్‌కు కాల్‌ఫర్ చేశారు. లోటస్‌పాండ్‌ మీటింగ్‌కు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. భారీగా సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ అభిమానులారా రండి.. తరలి రండి ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాది అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతగా యాక్టివ్‌గా లేని కొంతమంది నేతలకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.

బెంగళూరులో ఉన్న షర్మిల.. ఇవాళే హైదరాబాద్ వచ్చారు. కొత్త పార్టీతో పాటు మరి కొన్ని అంశాలపైనా ఆమె స్పందిస్తారని తెలుస్తోంది. షర్మిల పార్టీ పెడతారనే అంశంపై అనేక కథనాలు వస్తున్నా.. ఆమె నేరుగా స్పందించలేదు. నేటి సమావేశం తర్వాత వైరల్‌ అవుతున్న వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

ఏపీలో ఊపందుకున్న పోలింగ్.. భారీగా బారులు తీరిన ఓటర్లు.. ఇప్పటివరకు 22శాతం పోలింగ్ కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శ్రీనివాసులు