AP local polls : ఏపీలో ఊపందుకున్న పోలింగ్.. భారీగా బారులు తీరిన ఓటర్లు.. ఇప్పటివరకు 22శాతం పోలింగ్

Sarpanch Election in AP 2021 : తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. ఓటు వేసేందుకు జనం బారులు తీరుతున్నారు.

AP local polls : ఏపీలో ఊపందుకున్న పోలింగ్.. భారీగా బారులు తీరిన ఓటర్లు.. ఇప్పటివరకు 22శాతం పోలింగ్
Follow us

|

Updated on: Feb 09, 2021 | 10:39 AM

AP Panchayat Elections 2021 : ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. ఓటు వేసేందుకు జనం బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు.. మరికొన్ని చోట్ల నిర్బంధాలు. కొన్ని చోట్ల నేతల హడావుడి.. మరికొన్ని చోట్ల ఓటర్లకు ప్రలోభాలు. కొంచెం ప్రశాంతం.. మరికొంత అత్యుత్సాహం అన్నట్లుగా సాగుతోంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికల పోలింగ్‌‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల భారీగా పోలింగ్ నమోదు అవుతుంది. ఇప్పటి వరకు 22 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో తక్కువగా మరికొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

చిత్తూరు జిల్లా కమ్మకండ్రిగలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ సిబ్బందే ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఏజెంట్లు. దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

ప్రకాశం జిల్లా కూనంనేనివారిపాలెంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరస్పరం దాడులకు దిగాయి. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో బందోబస్తు పెంచారు పోలీసులు. అభ్యర్థులు కొన్ని చోట్ల గెలుపును అత్యంత చాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

Read Also …  AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ఎన్నికల ‘తొలి’ పోరు.. ఇప్పటివరకు 22శాతం పోలింగ్..