AP Panchayat Election Results 2021 LIVE: ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
Andhra Pradesh Local Body Election Results 2021 LIVE: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Andhra Pradesh Local Body Election Results 2021 LIVE: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు కూడా దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నో వివాదాలు, మరెన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. సవాళ్లు, ప్రతిసవాళ్లతో గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 9న ఇవాళ తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4గంటల వరకు కొనసాగనున్నాయి. తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.
ఈ విషయమై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జరగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మంగళవారం మొత్తం 3,249 పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే 525 స్థానాలు ఏగ్రీవం అయ్యాయి. మిగిలిన 2723 స్థానాలకు 7506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 32,502 వార్డ్ మెంబర్లకు గాను 12,185 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని గోపాల్ కృష్ణ చెప్పారు.
ఇక, 20,157 వార్డు మెంబర్లకు మొత్తం 43,601 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని తెలిపారు. ఎన్నికల కోసం మొత్తం 29,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటిలో 3,458 సెన్సిటివ్, 3,594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు గుర్తించామని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు.
ఇక ఎన్నికల నిర్వహణ కోసం.. 1,130 స్టేజ్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్‌లు, 3,249 స్టేజ్ ఇద్దరు రిటర్నింగ్ ఆఫీసర్లు, 1,432 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్ అధికారులతో పాటు 44,392 మంది ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ద్వారానే ఓటర్లకు నోటా అవకాశాన్ని తొలిసారి తీసుకురానున్నారు. ఇక, గుంటూరు, చిత్తురు ఏకగ్రీవాలపై ఎలక్షన్ కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎస్ఈసీ నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని గోపాల్ కృష్ణ ద్వివేది వివరించారు.
LIVE NEWS & UPDATES
-
పిడపర్తిపాలెం సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో గెలిచిన కరుణశ్రీ
గుంటూరు : పిడపర్తిపాలెం సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో గెలిచిన కరుణశ్రీ గుంటూరు : తోట్లపాలెం సర్పంచిగా 6 ఓట్లతో వీరరాఘవయ్య గెలుపు గుంటూరు : గార్లపాడు సర్పంచిగా 14 ఓట్లతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేశ్ గెలుపు గుంటూరు : చావావారిపాలెం సర్పంచి అభ్యర్థి కొరబోయిన జ్యోతికి 0 ఓట్లు
-
కృష్ణాజిల్లా మైలవరంలో పోలీసుల లాఠీ ఛార్జ్
కృష్ణాజిల్లా మైలవరంలో టెన్షన్..టెన్షన్. పంచాయతీ ఎన్నికల ముగిసిన తర్వాత పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా కౌంటింగ్ మొదలుపెట్టారు. దాంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు.
-
-
తొలిదశ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ సంతృప్తి
తొలి విడత ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 81.78 శాతం పోలింగ్ నమోదైందన్న ఆయన.. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 5.06 శాతం పోలింగ్ నమోదైందని వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని వెల్లడించారు. సజావుగా ఎన్నికలు నిర్వహించిన అధికారులు ఎస్ఈసీ అభినందనలు తెలిపారు. మిగతా దశల్లోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని స్పష్టం చేశారు.
-
నెల్లూరు జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి..
ఎరుకులరెడ్డిపాలెం సర్పంచిగా మేకల విజయలక్ష్మి విజయం
-
కడప జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి..
కొర్రపాటిపల్లె సర్పంచిగా కాసాలక్ష్మీ విజయం
-
-
ప్రకాశం జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి..
-
లింగంగుంట సర్పంచిగా తూమాటి కల్యాణి విజయం
-
సీతారాంపురం సర్పంచిగా మండవ శివానందరావు గెలుపు
-
వెలగపూడి సర్పంచిగా కృష్ణారావు విజయం
-
పాతపాడులో సర్పంచిగా కోదండరామిరెడ్డి విజయం
-
-
కర్నూలు జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి..
-
చిన్నవంగలి సర్పంచిగా మౌలిభాషా గెలుపు
-
మునగాల సర్పంచిగా మునగాల లోకేశ్‌రెడ్డి గెలుపు
-
రాయమల్పురం సర్పంచిగా పార్వతమ్మ గెలుపు
-
-
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పంచాయతీల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి :
విశాఖ: తగరంపూడి సర్పంచిగా 2 ఓట్ల ఆధిక్యంతో అప్పారావు గెలుపు
ప్రకాశం: తక్కెళ్లపాడు సర్పంచిగా నూతలపాటి రామ్మోహన్‌రావు విజయం ప్రకాశం: ఓబన్నపాలెం సర్పంచిగా పోలినేని వెంకటేశ్వర్లు గెలుపు ప్రకాశం: వాసపల్లిపాడు సర్పంచిగా నీలి సుబ్బారావు విజయం ప్రకాశం: ఓబన్నపాలెం సర్పంచిగా పోలినేని వెంకటేశ్వర్లు గెలుపు శ్రీకాకుళం: నిమ్మాడలో కింజరాపు సురేశ్ విజయం గెలుపొందిన సురేశ్.. అచ్చెన్నాయుడు అన్న కుమారుడు కృష్ణా: బొడ్డపాడు సర్పంచిగా శివశంకర్ గెలుపు కృష్ణా: చినపులిపాక సర్పంచిగా ఆరేపల్లి శివరామకృష్ణ విజయం కృష్ణా: చలివేంద్రపాలెం సర్పంచిగా బొమ్మరెడ్డి శివనాగిరెడ్డి విజయం కృష్ణా: కంకిపాడు మం. కందలంపాడు సర్పంచిగా బైరెడ్డి నాగరాజు గెలుపు తూర్పు గోదావరి.: ఎస్.పైడిపాల సర్పంచిగా జిగిరెడ్డి నారాయణమ్మ విజయం విశాఖ: బి.సింగవరం సర్పంచిగా సన్యాసినాయుడు విజయం విశాఖ: గోటివాడ సర్పంచిగా గోకాడ అర్జున గెలుపు విశాఖ: ఎం.కోటపాడు సర్పంచిగా సేనాపతి శేషఫణి విజయం విశాఖ: వెంకటరాజుపాలెం సర్పంచిగా దాసరి వెంకటరమణ గెలుపు విశాఖ: ఎ.కొత్తపల్లి సర్పంచిగా చింతల సత్య వెంకటరమణ విజయం విశాఖ: సీతానగరం సర్పంచిగా సుంకర చంటి గెలుపు విశాఖ: బైలపూడి సర్పంచిగా జాజిమొగ్గల సత్యనారాయణ గెలుపు పశ్చిమ గోదావరి: ఊటాడ సర్పంచిగా బుడితి జయరాజు విజయం పశ్చిమ గోదావరి : పాలమూరు సర్పంచిగా నారాయణస్వామినాయుడు విజయం పశ్చిమ గోదావరి: గంగడపాలెం సర్పంచిగా మల్లాడి ఉమా మహేశ్వరి విజయం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించిన బైరెడ్డి నాగరాజు చిత్తూరు: ఒరూరుపేట సర్పంచిగా జయంతి గెలుపు చిత్తూరు: కచ్చరవేడు సర్పంచిగా రాణమ్మ గెలుపు చిత్తూరు: ఎం.ఎస్.వి.పురం సర్పంచిగా సుబ్రహ్మణ్యంరాజు విజయం చిత్తూరు: జీఎన్ కండ్రిగ సర్పంచిగా జయచంద్రారెడ్డి విజయం చిత్తూరు: నెట్టేరి సర్పంచిగా సరోజమ్మ గెలుపు చిత్తూరు: పాలకూరు సర్పంచిగా పంకజాక్షి గెలుపు చిత్తూరు: వడ్డేపల్లి సర్పంచిగా దొరస్వామినాయుడు విజయం
చిత్తూరు: కొండ్రాజుకాల్వ సర్పంచిగా పరంధామనాయుడు గెలుపు కడప: తుడుములదిన్నె సర్పంచిగా కృష్ణారెడ్డి విజయం విశాఖ: కన్నంపాలెం సర్పంచిగా బర్ల తాతాలు గెలుపు విశాఖ: లైన్ కొత్తూరు సర్పంచిగా కొల్లు రహానే విజయం చిత్తూరు: చీకూరుపల్లి సర్పంచిగా అమరావతి విజయం చిత్తూరు: కరిడివారిపల్లి సర్పంచిగా ఆశ గెలుపు చిత్తూరు: బొమ్మాయిపల్లె సర్పంచిగా గౌరమ్మ విజయం చిత్తూరు: మంగళపల్లి సర్పంచిగా మురళి గెలుపు విశాఖ: ఎల్. సింగవరం సర్పంచిగా వేపాడ మనీషా విజయం కడప: తంగేడుపల్లె సర్పంచిగా లక్ష్మీదేవి గెలుపు కర్నూలు: పాండురంగపురం సర్పంచిగా డోలావతమ్మ గెలుపు కర్నూలు: పులిమద్ది సర్పంచిగా రఘురామరెడ్డి విజయం ప్రకాశం: సీతారామపురం సర్పంచిగా శివానందరావు విజయం ప్రకాశం: రాజుపాలెం సర్పంచిగా గర్నెపూడి కోటమ్మ గెలుపు ఒంగోలు: దేవరంపాడు సర్పంచిగా నన్నపనేని వేంకటేశ్వర్లు విజయం విశాఖ: పాపయ్యపాలెం సర్పంచిగా తలారి సత్యనారాయణ గెలుపు గుంటూరు: కోతివానిపాలెం సర్పంచిగా కామేపల్లి పద్మావతి గెలుపు కృష్ణా: జగన్నాథపురం సర్పంచిగా బండి విజయ్‌పాల్‌రెడ్డి గెలుపు
-
చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ
Chittoor District Election Result 2021 Update : చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థి లలితా భాస్కర్ గెలుపొందారు. వెదురుకుప్పం మండలం మొండి వెంకయ్య పల్లె పంచాయితీ సర్పంచ్ గా లలిత విజయం సాధించారు. లలిత భర్త భాస్కర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
-
గుంటూరు జిల్లా నందివెలుగు కౌంటింగ్ సెంటర్ దగ్గర హడావుడి
గుంటూరు జిల్లా నందివెలుగు కౌంటింగ్ సెంటర్ దగ్గర హడావుడి. అధికార పార్టీ బలపరిచిన ఏజంట్లను మాత్రమే కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతిస్తున్నారంటూ ఇతర అభ్యర్థుల ఏజెంట్లు ఆందోళన. కౌంటింగ్ సెంటర్ వద్ద నుండి వెళ్ళిపోవాలంటూ పోలీసులు హూకుం జారీచేశారు. కౌంటింగ్ సెంటర్ వద్ద వివాదం కొనసాగుతోంది.
-
కావలి డివిజన్లలో 377 మంది అభ్యర్థుల భవితవ్యం
నెల్లూరు జిల్లా కావలి డివిజన్లలోని 163 పంచాయతీలలో 25 ఏకగ్రీవం కాగా, ఒక పంచాయతీకి నామినేషన్ దాఖలు కాలేదు. 137 పంచాయతీలలో పోలింగ్ జరుగగా, 377 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2,91,668 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గులాబీ రంగు బ్యాలెట్ పత్రం పంచాయతీ, తెలుపు రంగు బ్యాలెట్ పత్రం వార్డు అభ్యర్థులకు కేటాయించారు. డివిజన్లోని 286 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు.
-
గంపగుత్తుగా టీడీపీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించడంతో ఆందోళన.!
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో నామినేషన్ల తిరస్కరణ గొడవ. గంపగుత్తుగా టీడీపీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించడంతో ఆందోళన. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజక వర్గంలోని రొంపిచెర్ల మండలంలోని 10 పంచాయతీల్లో నామినేషన్లను తిరస్కరించిన అధికారుల తీరుపై టీడీపీ నిరసన. టీడీపీ మద్దతుదారుల నామినేషన్లను అప్పీలుకు పంపిన ఎన్నికల అధికారులు. మరోవైపు, రొంపిచర్లలో టీడీపీ మద్దతుదారుల ఆందోళన కొనసాగుతోంది.
-
అనివార్య కారణాల రిత్యా ఫలితం వెలువడ్డం సాధ్యం కాకపోతే రేపే : అధికారులు
ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ఉదయం 6:30 నిమిషాలకు ప్రారంభంకాగా 10 గంటల వరకు మందకొడిగా సాగింది. 8 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటల తరువాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11:30 నిమిషాల వరకు 34.28 శాతం నమోదైంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 1:30 నిమిషాల వరకే పోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీసుల భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఒకటి రెండుచోట్ల మినహా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికాసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశముంది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉప సర్పంచ్‌ల ఎన్నిక నిర్వహిస్తారు. అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే ఎన్నిక రేపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
-
చిత్తూరు జిల్లాలో 83.90 శాతం పోలింగ్
చిత్తూరు జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 83.90 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు డివిజన్ లోని 454 పంచాయితీల్లో 112 ఏకగ్రీవం కాగా, 342 గ్రామ పంచాయితీలకు పోలింగ్ జరిగింది. వెదురుకుప్పం, ఎస్ ఆర్ పురం, రామచంద్రాపురం మండలాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేయగా పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమైంది.
-
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలివిడతలో 2723 సర్పంచ్, 20 వేల 157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ విడతలో వైసీపీ మద్దతు దారులు 500 పంచాయతీలు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. 18 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతు దారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
-
మా బాబాయ్ ని సర్పంచ్ చేస్తే 30 లక్షలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, చీమలవలస గ్రామానికి చెందిన సనపల శ్రావణ్ కుమార్ వృత్తి రీత్యా బిల్డర్! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి తన బాబాయ్ చేత నామినేషన్ వేయించాడు. అంతేకాదు, తన బాబాయ్‌ను ఏకగ్రీవంగా సర్పంచ్ చేస్తే.. గ్రామాభివృద్ధికి 30 లక్షలు ఇస్తానని ప్రకటించాడు.
-
ఇక ఇది ఇంకా వెరైటీ..! హేమలత గుర్తు గౌను! అందుకే ఇలా..
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో మూడవ వార్డు అభ్యర్థి హేమలత గుర్తు గౌను.! అందుకే గౌను వేసుకునే ఆమె దాదాపుగా ప్రచారం చేశారు. అందర్నీ ఆకట్టుకున్నారు.
-
జై మంచం.. జైజై మంచం
ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి మామూలుగాలేదు. తూర్పుగోదావరిజిల్లా పిఠాపురం మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి గుర్తు మంచం! అందుకే జై మంచం.. జైజై మంచం అంటూ ప్రచారం ఊదరగొట్టారు.
-
102 ఏళ్ల వయసులో ఓటు వేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం బోడపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 102 ఏళ్ల వయసులో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తెనాలి నుండి వచ్చి ఆయన ఓటు వేశారు.
-
గుంటూరు జిల్లాలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల మొదటి విడత కౌంటింగ్
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత కౌంటింగ్ ప్రారంభమైంది. తెనాలి మండలం అంగలకుదురులో అభ్యర్దులు, ఏజంట్ల ముందు పోలింగ్ బాక్స్ లను ఓపెన్ చేశారు అధికారులు.
-
అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూచిన టీడీపీ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్వగ్రామం అయిన నిమ్మాడ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఆ పంచాయతీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన డిఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
-
శ్రీకాకుళం జిల్లాలో 74 శాతం పోలింగ్
శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి అయింది. జిల్లాలో మొత్తం 282 పంచాయతీలకు మొదటి విడత పోలింగ్ జరిగింది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఆసక్తి చూపడంతో 74 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో కౌంటర్ ప్రక్రియకు సన్నద్ధమౌతున్నారు. సిబ్బంది కొరత అధికంగా వుండటంతో ఫలితాలు వెలువడే సరికి సమయం పట్టే అవకాశం వుంది.
-
కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా..
కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న హింసాత్మక ఘటన కూడా నమోదు కాకపోవడం పట్ల పోలీసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
-
Prakasam District Election 2021 Update: ఒంగోలు డివిజన్ పరిధిలో 80% శాతం పైగా పోలింగ్
ప్రకాశంజిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 192 పంచాయతీలకు తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి 80% శాతం పైగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లకు సీల్ వేసి సంతకాలు తీసుకున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి ఫలితాలు లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రకాశం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
-
Guntur Election 2021 Update: గుంటూరు జిల్లాలో మరికాసేపట్లో ప్రారంభంకానున్న కౌంటింగ్
గుంటూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో మరికాసేపట్లో ప్రారంభం కాబోయే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వార్డు, సర్పంచ్ ఓట్లను విడివిడిగా కట్టలు కట్టి లెక్కించనున్నారు సిబ్బంది. చిన్న పంచాయతీల్లో మొదటి గంటలోనే ఫలితం తేలిపోనుంది.
-
ఎం నిడమానూరు పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడమానూరు పోలింగ్ బూత్ వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూతు వద్ద ఓటర్లను TDP వర్గీయులు ప్రలోభపేడుతున్నారని వైసీపీ వర్గీయులు గొడవకు దిగారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
-
ఓటు వేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పాదిరి కుప్పంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
ఉలిమేశ్వరం గ్రామంలో ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో ఉద్రిక్తత, గొడవ. కారు అద్దాలు పగులకొట్టిన ఒక వర్గం.. ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల్ని చెదరగొట్టిన పోలీసులు.
-
ప్రతీ ఒక్క ఓటరు ధైర్యంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి : విశాఖ జిల్లా కలెక్టర్
విశాఖజిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరుగుతున్న అనకాపల్లి డివిజన్ పరిధిలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, DIG రంగారావు, ఎస్ పి వెంకట కృష్ణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అనకాపల్లి మండలం కొత్తూరు ఏర్పాటుచేసిన ఏఎన్ హై స్కూల్ లో పోలింగ్ తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్క ఓటరు ధైర్యంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
-
కమ్మకండ్రిగలో ఉద్రిక్తత..
చిత్తూరు జిల్లా కమ్మకండ్రిగ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ అభ్యర్థికి దొంగ ఓట్లు వేస్తున్నారని.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ.. వేరే వర్గం అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
-
ఏజెంట్ల మధ్య ఘర్షణ..
విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలంలోని పెదమల్లంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీలకు చెందిన ఏజెంట్లు పరస్పరం దాడికి దిగారు. దీంతో వైసీపీ ఏజెంట్ పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
పంచాయతీ పోరు.. మధ్యాహ్నం 12.30గంటల వరకు 62శాతం పోలింగ్
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు 62.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
-
కృష్ణా జిల్లా మొర్సుమల్లిలో ఘర్షణ..
కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లిలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
-
ఉత్కంఠగా కొనసాగుతున్న పోలింగ్..
గ్రామ పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో భాగంగా 3,249 సర్పంచ్ స్థానాలకు.. 32,504 వార్డులకు పోలింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మరికాసేపట్లో 1.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మిగతా ప్రాంతాల్లో 3.30 గంటలకు పోలింగ్ ముగియనుంది.
-
శ్రీకాకుళం జిల్లా గొట్టిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు..
శ్రీకాకుళం జిల్లా లక్ష్మినర్సుపేట (ఎల్ఎన్ పేట) మండలంని గొట్టిపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన దివ్యాంగుడు వేరే వారి సాయంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాడు. దీంతో మరో వర్గం వారు వారిని అడ్డుకోగా.. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాలకు తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసిన ఇరువర్గాలను చెదరగొట్టారు.
-
నిడమానూరులో సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై నోటా..
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో 5వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు గుర్తు వంకాయ కాగా.. ఆ గుర్తుపై అధికారులు నోటా అంటించారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదుచేశారు.
-
గుండెపోటుతో పోలింగ్ ఏజెంట్ మృతి
గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. 3వ బూత్ ఏజెంట్ నూర్‌బాషా మస్తాన్‌వలి(44) గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఏజెంట్ మస్తాన్‌వలి మృతిచెందాడు.
-
పోతుకుంటలో ఇరువర్గాల ఘర్షణ
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పోతుకుంటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరి ఓటు మరొకరు వేసేందుకు వచ్చారంటూ.. ఓ వర్గం ఆరోపించడంతో వివాదం చెలరేగింది. దీంతో పోతుకుంట పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాల ఎజెంట్లు పరస్పరం దాడి చేసుకున్నారు.
-
ఉప్పలపాడులో ఇరువర్గాల ఘర్షణ..
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
-
ఇప్పటివరకు 34.28శాతం పోలింగ్ నమోదు..
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 34.28శాతం పోలింగ్ నమోదైంది.
-
కృష్ణా జిల్లా జూలూరుపాడులో ఉద్రిక్తత..
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరుపాడు పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొననాయి. పోలింగ్ జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం వివాదానికి దారితీసింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
-
కర్నూలు జిల్లా రుద్రవరంలో ఇరు వర్గాల ఘర్షణ..
కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరు పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారంటూ .. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపించుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో స్పల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
-
నేలటూరులో వివాదం.. ముక్కుపుడకలు స్వాధీనం..
ప్రకాశం జిల్లా దువ్వూరు మండలం నేలటూరులో వివాదం నెలకొంది. ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ చేయడానికి ప్రయత్నించిన అమర్‌నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన దగ్గర 91 ముక్కుపుడకలు, రూ. 3వేలు స్వాధీనం చేసున్నారు.
-
విజయవాడ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతం: సీపీ శ్రీనివాసులు
విజయవాడ కమిషనరేట్ ఫరిధిలోని ఐదు మండలాల్లోని 55 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం, కంకిపాడు, పెడమలూరు, తొటవల్లూరు, విజయవాడ రూరల్ మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
-
గుంటూరు జిల్లాలో విషాదం.. ఏజెంట్ మృతి..
గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో విషాదం నెలకొంది. మూడో నెంబర్ బూత్‌లో ఎజెంట్‌గా మస్తాన్ వలీకి గుండెపోటు రావడంతో మృతి చెందారు.
-
బొట్లవారిపల్లిలో ఇరువర్గాలపై కేసులు..
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బొట్లవారిపల్లిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ, టీడీపీకి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ.. స్థానికులు వైసీపీ నేత నారాయణ రెడ్డిని నిర్భంధించారు.
-
కమ్మకండ్రిగలో రిగ్గింగ్ ఆరోపణలు..
చిత్తూరు జిల్లా కమ్మకండ్రిగ పోలింగ్ బూత్‌లల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఓ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. 4, 5 వార్డులకు సంబంధించిన పోలింగ్ బూత్‌లల్లో పోలింగ్ సిబ్బందే ఓట్లు వేస్తున్నారని ఏజెంట్ల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అడిషనల్ ఎస్పీ, జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా చేరుకోని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
-
రెండు వార్డుల్లో పోలింగ్ బహిష్కరణ..
నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ శంబునిపాలెంలోని రెండు వార్డులకు చెందిన ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఎస్సీ రిజర్వేషన్ దగ్గర ఓసి కేటాయించారంటూ శంబునిపాలెం గ్రామ ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు.
-
మొదటి మూడు గంటల్లో 22శాతం పోలింగ్..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు (9.30) ఏపీ వ్యాప్తంగా 22 శాతం పోలింగ్ నమోదయ్యింది.
-
మొదటి రెండు గంటల్లో 18శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం 8.30గంటల వరకు ఏపీ వ్యాప్తంగా 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
-
అనారోగ్యంతో ఉన్నా.. ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు..
పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. వృద్ధురాలు తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. బోదకాలుతో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 94 ఏళ్ల వృద్ధురాలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది.
-
కేంద్రాల దగ్గర 144 సెక్షన్..
పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి 100 మీటర్ల మేరకు రెడ్‌జోన్‌గా పోలీసులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీస్ ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు.
-
భారీ బందోబస్తుతో కొనసాగుతున్న పోలింగ్..
రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పలు పంచాయతీల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
-
పిఠాపురంలో ఉద్రిక్తత..
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం జల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైసీపీలోని రెబల్ అభ్యర్థికి టీడీపీ సపోర్ట్ చేస్తుందంటూ మరో వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి.
-
ప్రకాశం జిల్లా కూనంనేనివారిపాలెంలో ఇరువర్గాల ఘర్షణ..
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేని వారిపాలెంలోని పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కేంద్ర దగ్గర ఓటు వేసే విషయంలో వివాదం చెలరేగడంతో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి.
-
డబ్బులు పంచుతున్న ఇద్దరి అరెస్ట్..
ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో సూదివారిపాలెంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సర్పంచ్ అభ్యర్థి తరుపున డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఇద్దరి నుంచి రూ.32,500 స్వాధీనం చేసుకున్నారు.
-
తిరుపతి కమ్మకండ్రిగలో ఉద్రిక్తత..
తిరుపతి కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికల స్లిప్‌లపై ఎన్నికల గుర్తులు రాసి పంపుతున్నారని టీడీపీ నేతల ఆరోపిస్తున్నారు. ఈ మేరకుఅధికారపార్టీ వైసీపీ మద్దతిస్తున్న అభ్యర్థిపై టీడీపీ మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
ఇరు వర్గాల ఘర్షణలో ముగ్గురికి గాయాలు..
తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
-
మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు..
వైసీపీ అభ్యర్థిని ఎన్నికల నుంచి విరమించుకోవాలని బెదిరించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా బందరు మండలం పొట్లపాలెం వైసీపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకు రవీంద్రతోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
-
వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ..
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం వేములపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
-
కరోనా పాజిటివ్ వచ్చినవారికీ చివరిగంటలో ఓటు వేసేందుకు అవకాశం..
కరోనా పాజిటివ్ వచ్చిన వారు పోలింగ్ చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ముందే వెల్లడించారు. అలాంటి వారు చివరి గంటలో కేంద్రానికి రావాలని సూచనలు సైతం చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు మాస్క్‌లు, శానిటైజర్లను ఏర్పాటుచేశారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న ముద్రగడ
తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటును వినియోగించుకున్నారు.
-
కరోనా నేపథ్యంలో ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
-
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే..
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగతా ప్రాంతాల్లో 4గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
-
తూర్పు గోదావరి జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ..
తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
-
చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత నిర్భంధం..
AP Local body Elections 2021: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బొట్లవారిపల్లిలో వైసీపీ నేత నారాయణ రెడ్డిని స్థానికులు నిర్భంధించారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న ఆరోపణలపై ఏకమైన గ్రామస్తులు. గ్రామంలోని వీధుల్లో ముళ్ల కంచె వేసి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జక్కదోన పంచాయతీకి చెందిన వారికి తమ గ్రామంలో పనేంటని బొట్లవారిపల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Published On - Feb 09,2021 10:01 PM