Pawan Meets Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన జనసేన అధినేత పవన్.. వీరి భేటీకి కారణమదేనా?
Pawan Meets Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కలిశారు.
Pawan Meets Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కలిశారు. మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లిన ఈ ఇద్దరు నేతలు.. పార్లమెంట్‌లోని హోంమంత్రి కార్యాలయంలో ఆయన్ను కలిశారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను పవన్ వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణపై నిర్ణయాన్ని విరమించుకునేలా కేంద్ర పెద్దలతో మాట్లాడుతానని పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు ఉపసహరించుకోవాలనే కేంద్రం నిర్ణయాన్ని పవన్ మార్చగలుగుతారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
Also read:
Visa Holders: హెచ్-4 వీసాలపై యూఎస్ కోర్టు కీలక ఆదేశాలు.. మార్చి 4లోపు నివేదిక కోరిన కోర్టు