ఏలూరులో వింత వ్యాధిపై మరో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు.. వివిధ శాఖలు సిద్ధం చేసిన యాక్షన్‌ ప్లాన్‌ పరిశీలన

ఏలూరులో వింత వ్యాధిపై మరో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్‌. ఇప్పటికే వింత వ్యాధిపై అధ్యయనం చేసిన మల్టీ డిసిప్లీనరీ కమిటీ.. ఈ వింత వ్యాధిపై..

ఏలూరులో వింత వ్యాధిపై మరో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు.. వివిధ శాఖలు సిద్ధం చేసిన యాక్షన్‌ ప్లాన్‌ పరిశీలన
Subhash Goud

|

Feb 09, 2021 | 10:59 PM

ఏలూరులో వింత వ్యాధిపై మరో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్‌. ఇప్పటికే వింత వ్యాధిపై అధ్యయనం చేసిన మల్టీ డిసిప్లీనరీ కమిటీ.. ఈ వింత వ్యాధిపై పలు సూచనలు చేసింది. సూచనల అమలు కోసం 9 మంది సభ్యులతో హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కమిటీ చైర్మన్‌గా సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించారు. కాగా, వివిధ శాఖలు సిద్ధం చేసిన యాక్షన్‌ ప్లాన్‌ను కమిటీ పరిశీలించనుంది. ఈ హైలెవల్‌ కమిటీ నీరు, ఆహారం, గాలి, మట్టి, వ్యవసాయం, ఆక్వావ్యర్థాల పర్యవేక్షించనుంది. నెలకు ఒకసారి భేటీ కావాలని హైలెవల్‌ కమిటీని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.

కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం సృష్టించిన వింత వ్యాధి .. వందలాది మందిని ఆస్పత్రిపాలు చేసింది. తీవ్ర అస్వస్థకు గురైన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందు కోలుకున్నారు. ఈ వింత వ్యాధికి కారణాలను రాబడుతున్నారు అధికారులు. ఈ వింత వ్యాధికి గల కారణాలను అన్వేషించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇప్పుడు మరో కమిటీని ఏర్పాటు చేసింది.

Pawan Meets Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన జనసేన అధినేత పవన్.. వీరి భేటీకి కారణమదేనా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu