AP Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి కారణం అదే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
Achennayudu Comments On AP Local Body Elections: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం వైసీపీ మద్ధతిచ్చిన అభ్యర్థులు జోరు కొనసాగిస్తున్నారు...
Achennayudu Comments On AP Local Body Elections: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం వైసీపీ మద్ధతిచ్చిన అభ్యర్థులు జోరు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడానికి పోలీసులే కారణమని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఇప్పటి వరకు చూడలేదని ఆయన పేర్కొన్నారు. తన స్వగ్రామంలో ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యే పంచాయతీలో సైతం వైసీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా తన కుటింబీకులపై పోలీసులు కేసులు నమోదు చేశారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. 90 శాతం పోలింగ్ జరిగే తన గ్రామంలో పోలీసుల భయం కారణంగానే పోలింగ్ శాతం తగ్గిందని అచ్చెన్న ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.