AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబు తన కొడుక్కి జాబ్ ఇచ్చుకున్నాడు- షర్మిల

కృష్ణా: అవినీతి, అబద్ధాలు, అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్ చంద్రబాబు నాయుడని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్ షర్మిల రోడ్‌ షోను నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడంకోసం అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారని..ఆంధ్రప్రదేశ్ ప్రజలు తర్వలోనే ఈ మాయగాడి కుట్రలకు […]

బాబు తన కొడుక్కి జాబ్ ఇచ్చుకున్నాడు- షర్మిల
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 09, 2019 | 8:07 PM

Share

కృష్ణా: అవినీతి, అబద్ధాలు, అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్ చంద్రబాబు నాయుడని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్ షర్మిల రోడ్‌ షోను నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడంకోసం అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారని..ఆంధ్రప్రదేశ్ ప్రజలు తర్వలోనే ఈ మాయగాడి కుట్రలకు బుద్ది చెప్పబోతున్నారని చెప్పారు. కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రజలను మోసం చేశారని, ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని మండిపడ్డారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ను మాత్రం మూడు శాఖలకు మంత్రిని చేశారని ధ్వజమెత్తారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మైలవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ను, విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లురి వీరప్రసాద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో  విజయవాడ కీలక పాత్ర పోషించబోతుందని…కృష్ణా జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థల గెలుపు చారిత్రక అవసరమని షర్మిల ఆకాక్షించారు.