స్పీకర్ తో తేల్చుకుంటా.. రంగంలోకి దిగిన ఎడ్యూరప్ప ..

కర్ణాటక సంక్షోభంలో మరో మలుపు.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బి.ఎస్. ఎడ్యూరప్ప నేరుగా రంగంలోకి దిగారు. అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ను తాను మధ్యాహ్నం కలుసుకుంటానని, రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయమై ఏ నిర్ణయానికి వచ్చారని అడుగుతానని ఆయన అన్నారు. తిరుగుబాటు శాసన సభ్యుల రాజీనామాలను మంత్రి, కాంగ్రెస్ నేత శివకుమార్ చించివేయడాన్ని స్పీకర్ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. రాజీనామాల లేఖలను చించివేయడం క్షమార్హం కాదన్నారు. విధానసౌధ వద్ద తన మద్దతుదారులతో ఎడ్యూరప్ప […]

స్పీకర్ తో తేల్చుకుంటా..  రంగంలోకి  దిగిన ఎడ్యూరప్ప ..
Follow us

|

Updated on: Jul 10, 2019 | 5:02 PM

కర్ణాటక సంక్షోభంలో మరో మలుపు.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బి.ఎస్. ఎడ్యూరప్ప నేరుగా రంగంలోకి దిగారు. అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ను తాను మధ్యాహ్నం కలుసుకుంటానని, రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయమై ఏ నిర్ణయానికి వచ్చారని అడుగుతానని ఆయన అన్నారు. తిరుగుబాటు శాసన సభ్యుల రాజీనామాలను మంత్రి, కాంగ్రెస్ నేత శివకుమార్ చించివేయడాన్ని స్పీకర్ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. రాజీనామాల లేఖలను చించివేయడం క్షమార్హం కాదన్నారు. విధానసౌధ వద్ద తన మద్దతుదారులతో ఎడ్యూరప్ప ధర్నా చేశారు. కుమారస్వామి ప్రభుత్వానికి ఏర్పడిన ఈ పరిస్థితికి తమ పార్టీ ఎంతమాత్రం బాధ్యత వహించదని ఆయన పేర్కొన్నారు. కాగా-ముంబైలో హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి యత్నిస్తున్న కర్ణాటక మంత్రి కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ తో పార్టీ సీనియర్ నాయకుడు మిలింద్ దేవర ఫోన్లో మాట్లాడారు. మీకు స్థానిక కాంగ్రెస్ నేతల సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ హోటల్లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెంటనే మళ్ళీ బెంగుళూరుకు వెళ్లాలని, రాజ్యాంగబధ్ధంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. మహారాష్ట్రలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీ ఇలా విద్రోహ చర్యకు పాల్పడుతోందని మిలింద్ దేవర తన ట్వీట్ లో ఆరోపించారు. అటు-ముంబైలోని పోవై పోలీసు స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ నెల 12 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ ఈ పీఎస్ పరిధిలోనే ఉంది. ఇదిలాఉండగా..శాసనసభలో ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని కోరుతుందని కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావు తెలిపారు. బీజేపీ నేతలు మొదట స్పీకర్ కార్యాలయాన్ని, ఆ తరువాత గవర్నర్ పదవిని కూడా ఇష్టానుసారం వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక.. ముంబైలోని రెబల్ ఎమ్మెల్యేల విషయానికి వస్తే .’ రాజీ ‘పడేందుకు వారు ఎంతమాత్రం రెడీగా లేనట్టు కనిపిస్తోంది.కుమారస్వామి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికే సై అంటున్నారు. బెంగుళూరు నుంచి ముంబై వఛ్చిన రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ తో మాట్లాడేందుకు తమకిష్టం లేదని జేడీ-ఎస్ కు చెందిన ఓ శాసన సభ్యుడు తెలిపారు.’ మమ్మల్ని ఆయన ఎందుకు కలుసుకోదలుస్తున్నారు ‘ అని ఆయన ప్రశ్నించారు. శివకుమార్, ఆయన మద్దతుదారులనుంచి తమకు రక్షణ కల్పించాలని సుమారు 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు ముంబై కమిషనర్ కు రాసిన లేఖలో అభ్యర్థించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు