Nellore Politics: అందుకు ఎన్నికలే అవసరం లేదు.. నెల్లూరు నగరంపై సంచలన ప్రకటనలు చేసిన మాజీ మంత్రి ఆనం..

Anam Ramanarayana Reddy: నెల్లూరు నగరంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన ప్రకటనలు చేశారు.

Nellore Politics: అందుకు ఎన్నికలే అవసరం లేదు.. నెల్లూరు నగరంపై సంచలన ప్రకటనలు చేసిన మాజీ మంత్రి ఆనం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 14, 2021 | 8:34 PM

Anam Ramanarayana Reddy: నెల్లూరు నగరంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన ప్రకటనలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నెల్లూరు నగరం ఆనం కుటుంబ రాజకీయ జీవితంలో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. ఆనం వంశీకులు ఏ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. నెల్లూరు నగరంతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. ఆనం సంజీవ రెడ్డి, ఆనం వెంకట రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి, తాను, ఇలా నాలుగు తరాల రాజకీయం నెల్లూరుతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. నెల్లూరు నగర ప్రజలను కలవడానికి ఎన్నికలే కావాల్సిన అవసరం లేదన్నారు. నగరంలోని ప్రతి కుటుంబం తమ కుటుంబమే అని, తమ కుటుంబ సభ్యులను ప్రతీ ఒక్కరినీ కలుస్తామని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

నెల్లూరు నగరం నుండే రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు వెళ్లామన్న ఆయన.. ఈ నగరంతో సుధీర్ఘ అనుభవం ఉన్న తాము నెల్లూరు నుంచి దూరం కాలేమని వ్యాఖ్యానించారు. తమను నెల్లూరు నగరం నుంచి ఎవరూ దూరం చేయలేరని ఆనం అన్నారు. 2019 ఎన్నికల సమయంలో తమ పార్టీ నాయకత్వం తనను నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేయమని కోరారని చెప్పిన ఆయన.. ఈసారి ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్లక తప్పదని అన్నారు. అయితే సుధీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాము జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న సంబంధాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇక పొరుగు జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి వరకు వెళ్లి రాజకీయాలు చేసిన తమకు.. నెల్లూరులోని 10నియోజకవర్గాల్లో రాజకీయం చేయడం పెద్ద కష్టం కాదని ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also read:

Love Story: ‘నిన్ను నాలో దాచి.. నన్ను నీలో విడిచి.. వెళ్లిపొమ్మంటోంది ప్రేమ’.. మనసును తాకుతోన్న ‘లవ్ స్టోరీ‘ సాంగ్..

Priyanka Gandhi: బోటు నడిపే వ్యక్తికి ధన్యవాదాలు తెలిపిన ప్రియాంకా గాంధీ.. ఎందుకంటే..?