AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: ‘నిన్ను నాలో దాచి.. నన్ను నీలో విడిచి.. వెళ్లిపొమ్మంటోంది ప్రేమ’.. మనసును తాకుతోన్న ‘లవ్ స్టోరీ‘ సాంగ్..

New Song From Love Story Movie: సినిమాలను అత్యంత సహజంగా తెరకెక్కించే దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటారు శేఖర్ కమ్ముల. ఇక అందమైన ప్రేమ కథా చిత్రాలతో...

Love Story: ‘నిన్ను నాలో దాచి.. నన్ను నీలో విడిచి.. వెళ్లిపొమ్మంటోంది ప్రేమ’.. మనసును తాకుతోన్న ‘లవ్ స్టోరీ‘ సాంగ్..
Narender Vaitla
|

Updated on: Feb 14, 2021 | 8:23 PM

Share

New Song From Love Story Movie: సినిమాలను అత్యంత సహజంగా తెరకెక్కించే దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటారు శేఖర్ కమ్ముల. ఇక అందమైన ప్రేమ కథా చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అలాగే తన సహజ నటనతో ఆకట్టుకుంటోన్న సాయి పల్లవి.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అంచనాలు మాములుగా ఉండవు కదూ.. ప్రస్తుతం ఈ సినిమానే తెరకెక్కుతోంది. ‘లవ్‌స్టోరీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. మధ్యతరగతికి చెందిన అమ్మాయి, అబ్బాయిల మధ్య జరిగే ప్రేమ కథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాకు మంచి బజ్‌ను తెచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రేమికు దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈ సినిమాలో మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘నీ చిత్రం చూసి’ అనే సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. పాటలోని చరణాలను మనసును హత్తుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా.. ‘ఎంత చిత్రం ప్రేమ.. వింత వీలునామా రాసింది మనకు ప్రేమ.. నిన్ను నాలో దాచి, నన్ను నీలో విడిచి.. వెళ్లిపొమ్మంటోంది ప్రేమ’ అంటూ సాగే చరణాలు ఆకట్టుకుంటున్నాయి. మరి అందమైన ప్రేమ పాటను మీరూ ఓసారి వినేయండి.

Also Read: South Heroine: ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా..?