Eesha Rebba: ఈషారెబ్బాకు వాలెంటీన్‌గా ఉంటారా..? ఆసక్తికరమైన పోస్ట్ చేసిన అందాల భామ..
Eesha Rebba Instagram Post: ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి ఈషారెబ్బా. అనంతరం ‘అంతకు ముందు ఆ తర్వాత’...

Eesha Rebba Instagram Post: ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి ఈషారెబ్బా. అనంతరం ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈషా.. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ఈషాకు ‘అరవింద సమేత’ చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ ‘పిట్ట కథలు‘లో నటిస్తోన్న ఈ బ్యూటీ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‘ చిత్రంతోపాటు తమిళంలో మరో సినిమాలో నటిస్తోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈషాకు అలవాటు. ఇక ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఈ అందాల తార తాజాగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రేమికుల రోజును పురస్కరించుకొని పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు.. ‘నాకు వాలెంటీన్‌గా ఉంటారా..?’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈషా పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.
View this post on Instagram
