Young Indians of 2020: ఈ ఏడాది యువ డైనమిక్ వ్యక్తుల జాబితాలో చేరిన ఏకైక ఇండియన్ హీరోగా అల్లువారబ్బాయి రికార్డ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లువారబ్బాయి బన్నీ ఈ ఏడాది మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. 2020లో దేశంలో అత్యంత ప్రభావం చూపిన 25 మంది యువ డైనమిక్ వ్యక్తుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు...

Young Indians of 2020: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లువారబ్బాయి బన్నీ ఈ ఏడాది మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. 2020లో దేశంలో అత్యంత ప్రభావం చూపిన 25 మంది యువ డైనమిక్ వ్యక్తుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఏడాది విభిన్న రంగాలకు చెందిన డైనమిక్ పర్సన్స్ జాబితాను జీక్యూ ఇండియా మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో ఆర్థిక, క్రీడా, సమాజసేవ, వినోద రంగాలకు చెందిన వారు ఉన్నారు.
ఓ వైపు జీక్యూ ఈ లిస్ట్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మరోవైపు మ్యాగజైన్ ఫిబ్రవరి ఎడిషన్‌లో కూడా ప్రచురించనుంది. ఒక ఈ జాబితాలో ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థానం సంపాదించారు. భారతీయ సినీ రంగం నుంచి స్జలిస్ట్ లో చోటు దక్కించుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. గతఏడాది సంక్రాంతికి రిలీజైన అల వైకుంఠపురం సినిమాలో పాటలు దేశవిదేశాల్లో సందడి చేశాయి. కోట్ల వ్యూస్ తెచ్చిపెట్టాయి . అందుకే, 2020లో అల్లు అర్జున్‌ని జీక్యూ ఇండియా మోస్ట్ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్ ఇండియన్స్ లిస్ట్‌లో స్థానం కల్పించి గౌరవించింది.
అంతేకాదు సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్క శర్మ.. ఆమె సోదరుడు కర్నేశ్ శర్మకు స్థానం దక్కింది. ఈ తోబుట్టువులు స్థాపించిన క్లీన్ స్లేట్ ఫిలింస్ సంస్థ గతేడాది నిర్మించిన డిజిటల్ మూవీస్ బుల్‌బుల్, పాటల్ లాగ్ విజయం సాధించాయి. ఓ వైపు నటిగా మరోవైపు నిర్మాతగానూ రాణించడంతో ఆమెను ఈ జాబితాలో చేర్చింది జీక్యూ ఇండియా.
Also Read:




