Akira Nandan Latest Pic: పవన్ తనయుడు లేటెస్ట్ ఫోటో.. రాబోయే కాలానికి కాబోయే హీరో అంటున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాడు.. అయితే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా ...

Akira Nandan Latest Pic: పవన్ తనయుడు లేటెస్ట్ ఫోటో.. రాబోయే కాలానికి కాబోయే హీరో అంటున్న ఫ్యాన్స్
Follow us
Surya Kala

|

Updated on: Feb 14, 2021 | 7:49 PM

Akira Nandan Latest Pic: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాడు.. అయితే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు.. సెంటరాఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తాడు.

తల్లి రేణు దేశాయ్ దగ్గర పెరుగుతున్న అకిరా పూణే లో నివసిస్తున్నా.. మెగా ఫ్యామిలీలో ఏ సందడి నెలకొన్నా అకిరా ఆద్యలు కూడా హాజరవుతారు.. తమ అన్నదమ్ములతో కలిసి సంతోషంగా గడుపుతారు.. అయితే పదిహేడేళ్లకే అకిరా.. అన్న వరుణ్ తేజ్ పొడవుకు పోటీ వచ్చేస్తున్నాడు. ఫ్యామిలీ అందరికంటే పొడవు అనిపిస్తూ.. తాను కూడా నెక్స్ట్ హీరోగా ఎంట్రీకి రెడీ అని చెప్పకనే చెప్పేస్తున్నాడు పవన్ తనయుడు.

తాజాగా అకిరా కు సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన మూవీ స్పెషల్ షో ప్రదర్శించారు. ఈ మూవీకి మెగా కుటుంబంతో పాటు అకిరా తన చెల్లెలు ఆద్య తో పాటు వచ్చాడు. ఆ సమయంలో హీరో వైష్ణవ్ తేజ్ తో అకిరా దిగిన ఫోటో ఇప్పుడు తెగ సోషల్ మీడియా లో సందడి చేస్తోంది. పవన్ వారసుడుగా రానున్న హీరో అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read:

 చెక్ మూవీ వర్కింగ్ స్టిల్స్.. వింక్ బ్యూటీ ప్రియా వారియర్, క్రేజీ హీరో నితిన్ ఫోటోలు

ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా..?