Singer Sunitha: సింగర్ సునీతకు తన భర్త ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన కొత్త జంట..

ప్రస్తుతం సునీత తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు...

Singer Sunitha: సింగర్ సునీతకు తన భర్త ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన కొత్త జంట..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 14, 2021 | 7:21 PM

Singer Sunitha Interview: తన అందమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సింగ్ సునీత. పాటకే అందాన్ని తీసుకొచ్చిన గొంతు తనది. ఇక మొదటి వివాహం రద్దు తర్వాత చాలా ఏళ్ల పాటు ఒంటరి జీవితం గడిపిన సునీత తాజాగా రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో ఈ ఏడాది జనవరి 9న వివాహబంధంతో ఈ జంట ఒక్కటైంది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సునీత తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షోలో ఈ కొత్త జంట పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ఏడేళ్లుగా తాను సునీతను ఇష్టపడుతూ వచ్చానని, కానీ ఎప్పుడూ నేరుగా చెప్పలేదని అన్నాడు. ఇక ఇదే విషయమై సునీత మాట్లాడుతూ.. రామ్ తనతో కేవలం ‘ఇంకేంటీ‘ అంటూ మాత్రమే అనేవాడని, దాంట్లో అర్థాన్ని తెలుసుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. ‘నేను అసలు పెళ్లికి సిద్ధంగా లేను.. కానీ లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగింది. ఏదో పని కోసం కాల్ చేసిన రామ్.. ఫోన్‌లోనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాత నేనూ పెళ్లికి ఓకే చెప్పాను’ అని తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది సునీత.

Also Read: Hero Prabhas: ‘మా పాజిటివ్ హీరోకే ఎందుకు ఈ కష్టాలు’.. తెగ వర్రీ అవుతున్న ప్రభాస్ అభిమానులు