AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Prabhas: ‘మా పాజిటివ్ హీరోకే ఎందుకు ఈ కష్టాలు’.. తెగ వర్రీ అవుతున్న ప్రభాస్ అభిమానులు

డార్లింగ్‌ ప్రభాస్‌ ఆర్మీ తెగ ఫీలవుతున్నారు. పాన్ సూపర్‌ స్టార్ ఇమేజ్‌ వచ్చిందని ఆనందపడాలా.. లేక ప్రభాస్ సినిమాలకు వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫీల్‌ అవ్వాలో...

Hero Prabhas: 'మా పాజిటివ్ హీరోకే ఎందుకు ఈ కష్టాలు'.. తెగ వర్రీ అవుతున్న ప్రభాస్ అభిమానులు
Ram Naramaneni
|

Updated on: Feb 14, 2021 | 6:50 PM

Share

డార్లింగ్‌ ప్రభాస్‌ ఆర్మీ తెగ ఫీలవుతున్నారు. పాన్ సూపర్‌ స్టార్ ఇమేజ్‌ వచ్చిందని ఆనందపడాలా.. లేక ప్రభాస్ సినిమాలకు వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫీల్‌ అవ్వాలో అర్ధంకాక మదనపడిపోతున్నారు డైహార్డ్ ఫ్యాన్స్‌. భారీ లైనప్‌తో బాలీవుడ్ ను ఛాలెంజ్‌ చేస్తున్న ప్రభాస్‌… ఆ సినిమాలను ముందుకు తీసుకెళ్లటంలో మాత్రం తడబడుతున్నారు.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డార్లింగ్‌ సినిమాలకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. షూటింగ్ పూర్తయినా రాధేశ్యామ్‌ రిలీజ్‌ ఆలస్యమవుతోంది. పీరియాడిక్‌ రొమాంటిక్ డ్రామా కావటంతో విజువల్‌ ఎఫెక్ట్స్ కీలకంగా మారాయి. గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎప్పటికి కంప్లీట్‌ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో సినిమా కూడా ఆలస్యమవుతూ వస్తోంది.

నెక్ట్స్ సెట్స్ మీదకు వెళ్లిన సలార్‌కు కూడా తిప్పలు తప్పటం లేదు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను వరుస లీకులు వెంటాడుతున్నాయి. షూటింగ్ సంబంధించిన ఫోటోలు, డార్లింగ్‌ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో లీకులు ఎలా ఆపాలో అర్ధంకాక యూనిట్ తలపట్టుకున్నారు.

ఇక ఆదిపురుష్‌ ది ఇంకో రకం పరిస్థితి. మైథలాజికల్‌ మూవీగా ప్లాన్ చేస్తున్న ఈ భారీ విజువల్‌ వండర్‌ కోసం గ్రీన్‌ స్క్రీన్ సెట్‌ను రూపొందించారు. కానీ షూటింగ్ స్టార్ట్‌ అయిన తొలి రోజే సెట్‌ లో అగ్నిప్రమాదం జరగటంతో షూటింగ్ వాయిదా పడింది. మోషన్‌ క్యాప్చర్‌కు సంబంధించి ఎక్విప్‌మెంట్‌ అంతా కాలిపోవటంతో తిరిగి షూట్‌ స్టార్ట్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇలా డార్లింగ్ సినిమాలకు వరుసగా సమస్యలు ఎదురవుతుండటంపై ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడుతున్నారు.

Also Read:

Bigg Boss: కంటెస్టెంట్‌లను వెంటాడుతోందన్న బిగ్‌ బాస్‌ ఎఫెక్ట్.. కొంత మందిలో సూసైడల్‌ టెండన్సీ.. !

 రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే