సూపర్ హిట్ మూవీస్‌ రిజెక్ట్ చేసిన అక్కినేనివారబ్బాయి, అవి చేసి ఉంటే కెరీర్ ఓ రేంజ్‌లో ఉండేదంటున్న ఫ్యాన్స్.. లిస్ట్ ఏమింటే..

అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరంలో మొదటి వారసుడుగా టాలీవుడు లో ప్రేమకథ సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు సుమంత్. అప్పటి నుంచి ఒక హిట్ రెండు ప్లాప్ లుగా కెరీర్ సాగుతుంది. ఓ వైపు ఎన్నార్ మనవడు.. మరోవైపు కింగ్ నాగార్జున మేనల్లుడు ఈ బ్రాండ్ కూడా సుమంత్ కెరీర్ ను..

  • Surya Kala
  • Publish Date - 6:02 pm, Sun, 14 February 21
సూపర్ హిట్ మూవీస్‌ రిజెక్ట్ చేసిన అక్కినేనివారబ్బాయి, అవి చేసి ఉంటే కెరీర్ ఓ రేంజ్‌లో ఉండేదంటున్న ఫ్యాన్స్.. లిస్ట్ ఏమింటే..

Sumanth Rejected Movies: అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరంలో మొదటి వారసుడుగా టాలీవుడు లో ప్రేమకథ సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు సుమంత్. అప్పటి నుంచి ఒక హిట్ రెండు ప్లాప్ లుగా కెరీర్ సాగుతుంది. ఓ వైపు ఎన్నార్ మనవడు.. మరోవైపు కింగ్ నాగార్జున మేనల్లుడు ఈ బ్రాండ్ కూడా సుమంత్ కెరీర్ ను గాడిన పెట్టడానికి సరైన బూస్ట్ ఇవ్వలేకపోయాయని చెప్పవచ్చు..

సుమంత్ యువకుడు , సత్యం, గౌరీ, గోదావరి, పౌరుడు, గోల్కొండ హైస్కూల్, వంటి హిట్ సినిమాల్లో నటించినా స్టార్ హీరో అవ్వలేకపోయాడు. సుమంత్ కంటే వెనుక అడుగు పెట్టిన ఎందరో యంగ్ హీరోలుగా కెరీర్ లో దూసుకుపోతున్నారు.

పెద్ద ఫ్యామిలీ నేపధ్యం.. ఆకట్టుకునే పర్సనాలిటీ, మంచి నటన ఇవన్న ఉన్నా సుమంత్ ఇంకా కెరీర్ లో వెనుకబడే ఉన్నాడు. దీనికి ఓ రీజన్ కూడా ఉందని ఫిల్మ్ నగర్ లో ఓ టాక్.. అది ఏమిటంటే.. సుమంత్ కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడట.. అవి వేరే హీరోల దగ్గరకు వెళ్లి.. వాళ్ళ కెరీర్ కు బూస్ట్ ఇచ్చాయని అంటున్నారు. మరి సుమంత్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ లో మిస్ చేసుకున్న సూపర్ హిట్ 10 సినిమాల లిస్ట్ చూద్దాం..!

బాలనటుడి నుంచి హీరోగా అడుగు పెట్టిన తరున్ కెరీర్‌లో సూపర్ హిట్ గా నిలిచిన నువ్వేకావాలి.. పవన్ కళ్యాణ్ కు కెరీర్‌లో మోస్ట్ మెమరబుల్ మూవీగా నిలిచిన తొలిప్రేమ సహా పలు సినిమాలను సుమంత్ రిజెక్ట్ చేశాడట.. నువ్వువస్తావని , మనసంతా నువ్వే , ఆనందం , ఇడియట్ , దేశముదురు , గమ్యం , అష్టా- చమ్మా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ వంటి సినిమాలను వదిలేసుకున్నాడట.. ఒకవేళ ఆ సినిమాలను సుమంత్ చేసుంటే.. అతని కెరీర్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేది అని అక్కినేని ఫ్యాన్స్ అంటుంటారు..

ఎందుకంటే ఒక్క నా ఆటోగ్రాఫ్ సినిమా తప్పిస్తే.. మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో సక్సెస్ అందుకున్నవే.. ఆ మూవీస్ కనుక సుమంత్ చేసుంటే.. ఈరోజు సక్సెస్ ఫుల్ హీరోగా సుమంత్ కొనసాగేవాడేమో.. ఏది ఏమైనా.. సుమంత్ తాజా సినిమా కపటదారి తో నైనా కెరీర్ టర్న్ అవుతుందేమో చూడాలి మరి

Also Read:

త్వరలో డిజిటల్ రానున్న ఉప్పెన మూవీ .. డేట్ ఎప్పుడో తెలుసా..!

మరో వెబ్ సిరీస్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ‘మూడు గులాబీల’తో రానున్న చందమామ బ్యూటీ..