మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ‘మూడు గులాబీల’తో రానున్న చందమామ బ్యూటీ..
ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన చందమామ బ్యూటీ కాజల్ వరుస ఆఫర్లతో జోరు మీదుంది. ఇటు వెండితెరపై సినిమాలు చేస్తూ..
Kajal Aggarwal: ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన చందమామ బ్యూటీ కాజల్ వరుస ఆఫర్లతో జోరు మీదుంది. ఇటు వెండితెరపై సినిమాలు చేస్తూ.. డిజిటల్ మీడియాపై కూడా దృష్టి సారించింది. ఇప్పటికే లైవ్ టెలీకాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు సారథ్యంలో హారర్ జోనర్లో ఈ సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ అమ్మడు మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చనట్లుగా సమాచారం.
డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో కాజల్ లీడ్ రోల్లో నటించనుందట. ఈ వెబ్ సిరీస్‌కు ‘త్రీ రోజెస్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. త్వరలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా టాక్. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో రాబోతున్న ‘భారతీయుడు 2’లో నటిస్తుండగా.. తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తుంది కాజల్.
Also Read: ‘పక్కా కమర్షియల్’ గా రాబోతున్న యాక్షన్ హీరో.. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ సినిమా..