టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన ప్రభాస్ హీరోయిన్.. నెలకో సినిమా విడుదల చేస్తోన్న బ్యూటీ..
ఈసారి సంవత్సరం వరసు సినిమాలు చేస్తూ.. మోస్ట్ బిజీ హీరోయిన్గా మారింది పూజాహెగ్డే. ప్రస్తుతం పూజా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది.
Actor Pooja Hegde: ఈసారి సంవత్సరం వరసు సినిమాలు చేస్తూ.. మోస్ట్ బిజీ హీరోయిన్గా మారింది పూజాహెగ్డే. ప్రస్తుతం పూజా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. అటు తెలుగులో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ ఆఫర్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ బ్యూటీ నటించిన మూడు సినిమా వరుసగా నెలకో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్కినేని అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మెగాస్టార్ ఆచార్య, ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమాలు విడుదలకానున్నాయి..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో పూజా గెస్ట్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు నటిస్తుంది. ఇక ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 13న విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. అక్కినేని అఖిల్‌తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా జూన్ 19న విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్‍కు జోడిగా నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా సమ్మర్లో రానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో జూలై 30న విడుదల కాబోతుంది. దీంతో పూజ సమ్మర్లో స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. వరుసగా నెలకో సినిమాను విడుదల చేస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా టాప్ రేసులో దూసుకుపోతుంది పూజా.
Also Read: టాలీవుడ్ బ్యూటీస్ మధ్య కుర్చీలాట, దూసుకుపోతున్న పూజా హెగ్డే, భలే ప్లాన్ !