టాలీవుడ్‌ బ్యూటీస్ మధ్య కుర్చీలాట, దూసుకుపోతున్న పూజా హెగ్డే, భలే ప్లాన్ !

టాలీవుడ్‌ బ్యూటీస్ మధ్య కుర్చీలాట జరుగుతోంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఇప్పటికే నెంబర్ గేమ్‌లో ముందున్నారు అనుష్క, సమంత.

టాలీవుడ్‌ బ్యూటీస్ మధ్య కుర్చీలాట, దూసుకుపోతున్న పూజా హెగ్డే, భలే ప్లాన్ !
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 22, 2020 | 12:45 PM

టాలీవుడ్‌ బ్యూటీస్ మధ్య కుర్చీలాట జరుగుతోంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఇప్పటికే నెంబర్ గేమ్‌లో ముందున్నారు అనుష్క, సమంత. ఈ లిస్ట్‌లోకి లేట్‌గా ఎంటరైనా.. ముందున్న బ్యూటీస్‌కు చుక్కలు చూపిస్తున్నారు పూజా హెగ్డే. పేమెంట్ విషయంలో హీరోలతో పోటి పడే హీరోయిన్స్ కొద్ది మందే ఉంటారు. ఆ లిస్ట్‌లోకే వస్తారు అనుష్క, సమంత. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో సొంత మార్కెట్‌ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీస్‌ మీడియం రేంజ్‌ హీరోలతో సమానంగా పారితోషికాలు అందుకునే వారు. ఈ రేంజ్‌లో జెండా పాతిన హిట్ బ్యూటీస్‌ను దాటి ఎవరెస్ట్ అంచున నిలుచున్నారు పూజా హెగ్డే.

ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లో టాప్ చైర్‌కు రీచ్‌ అయిన పూజ, పేమెంట్ విషయంలోనూ నేనే నంబర్ వన్‌ అంటున్నారు. అనుష్క, సమంతలా ఒక్క సినిమాకే నాలుగైదు కోట్లు డిమాండ్ చేయకుండా.. సరికొత్త ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు ఈ కన్నడ పాలపిట్ట. అనుష్క, సమంతతో సినిమా అంటే భారీగా సమర్పించుకోవాల్సిందే. పైగా ఏజ్‌ ఓల్డ్ అనే ఫీల్‌ క్రియేట్‌ అవుతుంది. అదే పూజతో అయితే అంతవసరం లేదు. రెండున్నర.. మూడు కోట్లతో సరిపోతుంది. పైగా ప్యాన్‌ ఇండియా ఇమేజ్‌ ఎలాగూ ఉంది. అందుకే ఆఫర్ల విషయంలోనూ అనుష్క, సమంత కన్నా ముందే ఉన్నారు పూజా హెగ్డే. ఒక్క సినిమాకే టాప్ రెమ్యూనరేషన్ అందుకోకపోయినా.. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ముందున్న హీరోయిన్స్‌ను దాటేస్తున్నారు పూజ హెగ్డే.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్